Congress party Flag: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ పరిస్థితి ఎదురుకావడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
137 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏటికి ఎదురీదుతోంది. రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో..కేంద్రంలో కూడా అదే పరిస్థితిలో ఉంది. నేతలు, కార్యకర్తల్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో పార్టీ ఉంది. జాతీయ స్థాయి పార్టీకు సరైన నాయకత్వమే లేకుండా పోయింది. పార్టీ సీనియర్ నేతలు పార్టీ పరిస్థితిపై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పార్టీలో సరైన క్రమశిక్షణ లోపించింది.
ఇదే పరిస్థితి పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవంలో (Congress Party 137th Foundation Day) కూడా ఎదురైంది. ఘోరమైన చేదు అనుభవం తలెత్తింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ పతాకం కింద పడిపోయింది. పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించే సందర్భంలో ఒక్కసారిగా గ్రిప్ పోయి..జెండా కాస్తా కిందకు పడిపోయింది. జెండా ఎగరకుండానే తలవంచేసింది. నేరుగా సోనియా చేతుల్లో పడింది. వెంటనే సరిచేసందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో అలాగే కార్యక్రమం కానిచ్చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC
— ANI (@ANI) December 28, 2021
Also read: PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత డబ్బులు ఎప్పుడు, e-Kyc తప్పనిసరి మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి