Uttarakhand New CM: ఉత్తరాఖండ్‌కు మరోసారి ముఖ్యమంత్రి మారారు. మొన్న త్రివేంద్ర సింగ్ రావత్, నిన్న తీరత్ సింగ్..ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామి. తీరత్ సింగ్ రాజీనామా తప్పని పరిస్థితులతో పుష్కర్ సింగ్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కేవలం నాలుగు నెలల కాలంలో మరోసారి ముఖ్యమంత్రి మారుతున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) ఎంపికయ్యారు. 2017లో జరిగిన ఉత్తరాఖండ్ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ఎన్నికయ్యారు. అనంతర రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ కారణాలతో మార్చ్ 10 వ తేదీన తీరత్ సింగ్ ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా బాథ్యతలు చేపట్టారు. అప్పటికి ఎమ్మెల్యే కాకపోవడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలలకాలంలో శాసనసభ సభ్యుడిగా ఎన్నిక కావల్సి ఉంది. ఆ గడువు కాస్తా సెప్టెంబర్ 5తో ముగియనుంది. అయితే అప్పటికి రాష్ట్ర ఎన్నికలకు (Uttarakhand Elections 2022) మరో 6 నెలలు మాత్రమే సమయముంది. ఫలితంగా రాజ్యాంగ పరమైన నిబంధనల ప్రకారం ఉపఎన్నిక జరపలేని పరిస్థితి. దాంతో మరోసారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని మార్చక తప్పని పరిస్థితి. 


ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా సత్పాల్ మహారాజ్, ధన్‌సింగ్ రావత్, పుష్కర్ సింగ్ రావత్‌లు పోటీ పడగా..బీజేపీ(BJP) అధిష్టానం పుష్కర్ సింగ్ రావత్ వైపే మొగ్గు చూపింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ రావత్‌ను ఎంపిక చేసింది. పుష్కర్ సింగ్ ఇప్పటి వరకూ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 


Also read:Corona Vaccination: దేశంలో జోరందుకున్న కరోనా వ్యాక్సినేషన్, ఇప్పటి వరకూ 34 కోట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook