Rahul Gandhi suggested central government: న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు. ప్రవేశ పరీక్షల నిర్వహణకు ముందు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ‘మన్ కీ బాత్’ ( Students Mann Ki Baat ) ను వినాలని సూచిస్తూ.. ఆదివారం ట్విట్ చేశారు. కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణకు ముందు విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్, సెప్టెంబర్ 13న నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) షెడ్యూల్‌ను సైతం ప్రకటించిది. Also read: JEE Main Admit Card: జేఈఈ మెయిన్స్, NEET హాల్‌ టికెట్లు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి



ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. ‘‘ఈరోజున లక్షలాది మంది విద్యార్థులు ఏదో చెప్పాలనుకుంటున్నారు.. నీట్, జేఈఈ పరీక్షల విషయంలో విద్యార్థుల మనసులో మాటను భారత ప్రభుత్వం తెలుసుకుని.. ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’’ అంటూ ఆయన ట్విట్ చేశారు.  కోవిడ్-19 కేసుల నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్ చేసి ప్రశ్నించారు. ఇదిలాఉంటే.. జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయాలని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia)  సైతం శనివారం కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. Also read: Covid-19: జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయండి: సిసోడియా