Manish Sisodia requested cancel JEE, NEET exams: న్యూఢిల్లీ: జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలు జేఈఈ ( JEE ), నీట్ ( NEET )లను కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్‌సైట్లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా డౌన్‌లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది. అయితే.. కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కాలంలో పరీక్షలు నిర్వహించడంపై ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ( Manish Sisodia ) కేంద్ర ప్రభుత్వం ( Central government ) పై ఆగ్రహం వ్యక్తంచేశారు. జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ట్విట్ చేశారు.
JEE-NEET की परीक्षा के नाम पर लाखों छात्रों की ज़िंदगी से खेल रही है केंद्र सरकार. मेरी केंद्र से विनती है कि पूरे देश में ये दोनो परीक्षाएँ तुरंत रद्द करें और इस साल एडमिशन की वैकल्पिक व्यवस्था करे.
अभूतपूर्व संकट के इस समय में अभूतपूर्व कदम से ही समाधान निकलेगा. @DrRPNishank— Manish Sisodia (@msisodia) August 22, 2020
‘‘జేఈఈ, నీట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాటిని రద్దు చేసి ఈ ఏడాదికి ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి ఇతర మార్గాలను అణ్వేషించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఊహించని సంక్షోభం తలెత్తినప్పుడు ఇలాంటి నిర్ణయమే పరిష్కారానికి దారి చూపిస్తుంది.’’ అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌కు ట్వీట్‌ను జతచేశారు. Also read: Babri Masjid demolition case: బాబ్రీ కేసులో తీర్పునకు ‘సుప్రీం’ కొత్త డెడ్‌లైన్
— National Testing Agency (@DG_NTA) August 21, 2020
కరోనా కాలంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీల వరకు, నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న, జేఈఈ అడ్వాన్స్ పరీక్ష సెప్టెంబర్ 27న జరుగుతాయని ఏన్‌టీఏ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. Also read: India: 30 లక్షలు దాటిన కరోనా కేసులు