Fifteen new Rajasthan ministers will take oath Today: రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ పునర్​వ్యవస్థీకరణకు సిద్ధమైంది. కొత్తగా 15 మందిని కేబినెట్లోకి (Fifteen new ministers into Rajasthan Cabinet) తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పార్టీ కీలక నేత అయిన సచిన్ పైలట్ వర్గం (Sachin Pilot camp) నుంచి 5 మందికి చోటు కల్పించాలని సీఎం అశోక్ గెహ్లోత్ (CM Ashok Gehlot) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 15 మందిలో 12 మంది కొత్త వాళ్లేనని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే వాళ్లలో 11 మంది కేబిటనెట్ మంత్రులుగా, నలుగురు స్వతంత్ర హోదాలో ఉండనున్నట్లు సమాచారం.


నేడు (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు కొత్త మంత్రులు గవర్నర్ నివాసంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.


Also read: షార్ట్స్ ధరించినందుకు బ్యాంకు లోపలికి నో ఎంట్రీ... కోల్‌కతా యువకుడికి చేదు అనుభవం...


Also read: ఝార్ఖండ్ లో రైల్వే ట్రాక్ ను పేల్చేసిన మావోయిస్టులు.. నిలిచిన రైలు రాకపోకలు


ప్రస్తుతం ఇలా..


రాజస్థాన్​లో 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయ. దీని ప్రకారం.. 30 మందికు మంత్రి పదవి ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 21 మందితోనే కేబినెట్ పని చేస్తోంది.


ఓ నివేదిక ప్రకారం.. గోవిద సింగ్, హరీశ్ చౌదరి, రఝ శర్మకేబినెట్​ నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నారు. సీఎం సిఫార్సు మేరకు గవర్నర్ వారి రాజీనామాలు ఆమోద ముద్ర వేసే అవకాశముంది. దీనితో ప్రస్తుతం స్వతంత్ర హోదాలో ఉన్న ముగ్గురు మంత్రులకు కేబినెట్ హోదా దక్కనుందని తెలుస్తోంది.


Also read: ‘ఇమ్రాన్ ఖాన్ నా పెద్దన్న’.. సిద్ధూ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ గంభీర్ ఫైర్


సచిన్​ పైలర్ వర్గంలో మంత్రులు వీరేనా?


సచిన్ పైలట్​కు సన్నిహుతులుగా ఉండే.. రమేశ్ మీనా, విశ్వేంద్ర సింగ్, తిరిగి మంత్రి వర్గంలోకి రానున్నట్లు సమాచారం. బ్రిజేంద్ర సింగ్, ఓలా, హెమరామ్ చౌదరి, మురారీలాల్​ మీనాలకు మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


Also read: సిద్దూ మరో వివాదం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రశంసలు


Also read: తమిళనాడు: లైంగిక వేధింపులు తాళలేక.. బాలిక బలవన్మరణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook