తమిళనాడు: లైంగిక వేధింపులు తాళలేక.. బాలిక బలవన్మరణం

లైంగిక వేధింపులకు గురైన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తనకు జరిగిన దారుణాన్ని ఓ లేఖలో రాసి మరీ చనిపోయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 07:22 PM IST
తమిళనాడు: లైంగిక వేధింపులు తాళలేక.. బాలిక బలవన్మరణం

Tamil Nadu: దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కామాంధుల కోరల్లో చిక్కి...అడపిల్లలు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటన తమిళనాడు(Tamil Nadu)లో చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు(sexual harassment) తాళలేక ఓ బాలిక బలవన్మరణానికి(Girl Suicide) పాల్పడింది. లేఖ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకుంది. 

కరూర్ జిల్లాలో 12వ తరగతి చదివే ఓ బాలిక శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకుంది. బాలిక చనిపోయే ముందు తన వ్యక్తిగత డైరీలో ఓ లేఖ(Letter) రాసిపెట్టింది. దాంట్లో తాను లైంగిక వేధింపులు గురయ్యానని పేర్కొంది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు బాలికపై లైంగిక వేధింపుల(sexual harassment)కు సంబంధించి.. ఆమె చదివే పాఠశాలలో జిల్లా విద్యా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక వాట్సాప్ చాట్​ను సైబర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. 

Also Read: మైనర్ బాలికపై నలుగురి గ్యాంగ్ రేప్... ప్రియుడి కళ్ల ముందే అఘాయిత్యం...

తమిళనాడులో రెండు వారాలలోపు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మైనర్ ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండో కేసు. గతవారం కోయంబత్తూర్​( Coimbatore)లో ఇదే తరహా ఘటన జరిగింది. ఓ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిందితుడిని, స్కూల్ ప్రిన్సిపల్​ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News