న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా అలజడి రేపిన హైదరాబాద్ దిశ అత్యాచార, హత్య ఘటనపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. దిశపై అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండించిన రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదని అన్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో నిర్భయ ఘటన తర్వాత చేసిన చట్టాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. లోక్ సభలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన.. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులను నివారించేందుకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. ఈ విషయంపై సభలో అందరం చర్చించి ఏకాభిప్రాయానికి వస్తే.. కఠిన చట్టాలు తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఇచ్చే సలహాలు, సూచనలు ఏవైనా స్వీకరిస్తామని మంత్రి తేల్చిచెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : దిశకు మద్యం తాగిస్తూ అత్యాచారం.. శవంపై సైతం నిందితుల కీచకపర్వం


దిశపై సామూహిక, అత్యాచారం ఘటన నేడు పార్లమెంట్‌లో ఉభయ సభలను కుదిపేసింది. సమాజ్‌వాదీ ఎంపి జయాబచ్చన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన నిందితులను బయటికి తీసుకొచ్చి ప్రజలకు అప్పగిస్తే.. వారే సరైన శిక్ష విధిస్తారని మండిపడ్డారు. Read also : యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు: నిందితులున్న చర్లపల్లి జైలు బయట ఉద్రిక్తత.. భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు