Rajnikanth: తమిళనాట కీలక పరిణామాలు రేపు చోటుచేసుకోనున్నాయి. తమిళ ఆరాధ్య నటుడు రేపు తీసుకోబోయే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారవచ్చు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు తమిళనాడుపై పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ( Tamilnadu Assembly Elections ) వచ్చే bjpఏడాది జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడిప్పుడే తమిళనాట రాజకీయం వేడెక్కుతోంది. ఏ పార్టీ ఏ వైఖరి తీసుకోబోతుందనేది ఇంకా తెలియలేదు. ఫిబ్రవరి 2021లో విడుదల కానున్న శశికళ ( Sasikala ) ఎలాంటి పరిణామాలు సష్టిస్తుందో ఆసక్తి కల్గిస్తోంది. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పరిస్థితి ఏంటి..పార్టీ ప్రకటించి చాలా రోజులైనా యాక్టివ్ పాలిటిక్స్ మోడ్ లో రాలేదింకా. ఆయన రాజకీయ రంగప్రవేశం కోసం అభిమానులు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. పలు దఫాలుగా నేతలతో సమావేశమయ్యారు రజినీకాంత్. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ పోటీ చేయలేదు. ఇంకా సినిమాలపైనే దృష్టి సారించి ఉన్నారు. ఈ క్రమంలో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజినీకాంత్ పార్టీ నేతలతో కీలకమైన భేటీ నిర్వహించనున్నారు. పార్టీలో వివిధ దశల్లో ఉన్న క్యాడర్‌, అభిమాన సంఘాల ప్రతినిధులతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రజినీకాంత్ మంతనాలు నిర్వహించనున్నారు. ఈ భేటీలో రజినీకాంత్ ( Rajnikanth ) తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.


రజినీకాంత్ తీసుకునే నిర్ణయమేంటి


రజినీకాంత్ ముందు ప్రస్తుతం మూడు మార్గాలున్నాయని తెలుస్తోంది. ఒకటి రాజకీయాల్నించి తప్పుకోవడం. పార్టీ ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు. రెండోది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా..పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నించడం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకున్న బలంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇక మూడో ప్రత్యామ్నాయం బీజేపీ వైపు మొగ్గు చూపడం. అంటే బీజేపీలో పార్టీని కలపడం లేదా బయట్నింటి బీజేపీ ( BJP ) కు మద్దతివ్వడం. రేపు జరగనున్న కీలక సమావేశంలో రజినీకాంత్ తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. 


ఇప్పటికే రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ( AIADMK ), స్టాలిన్ ( Stalin ) సారధ్యంలోని ప్రతిపక్షం డీఎంకే పార్టీల్ని తట్టుకుని రజినీకాంత్ పార్టీ రజినీ మక్కళ్ మండ్రం నిలబడగలుగుతుందా అనేది ఆసక్తి కలిగించే పరిణామం. రజినీకాంత్ వైఖరి ముందు నుంచీ బీజేపీకు అనుకూలంగా ఉన్న నేపధ్యంలో..ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. Also read: CoviShield ఎమర్జెన్సీ వినియోగానికి దరఖాస్తు: అదర్ పూనావాలా