Union Minister Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓ బ్రియాన్ సహా 11 మంది నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానానికి షెడ్యూల్ ప్రకారం జూలై 24న ఓటింగ్ జరగాల్సి ఉండగా.. పోటీలో ఒక అభ్యర్థి నిలబడడంతో ఏకగ్రీవం అయ్యాయి. నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్, ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో బీజేపీ, మిత్రపక్షాల మొత్తం సీట్లు 105కి పెరగగా.. కాంగ్రెస్‌కు ఒక సీటు తగ్గింది. కాంగ్రెస్‌కు 30 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి సభ్యుల సంఖ్య 94 కు చేరనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ నుంచి బీజేపీ తరఫున ఎస్.జైశంకర్, బాబూభాయ్ దేశాయ్, కేసరిదేవ్ సింగ్ ఝాలా.. పశ్చిమ బెంగాల్ నుంచి అనంత్ మహరాజ్, గోవా నుంచి  సదానంద్ షెట్ తనవాడే  ఎన్నికయ్యారు. డెరెక్ ఓబ్రెయిన్‌తో పాటు ఇతర తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సుఖేందు శేఖర్ రాయ్, డోలా సేన్, సాకేత్ గోఖలే, సమీరుల్ ఇస్లాం, ప్రకాష్ బారిక్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
మొత్తం 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో ఏడు సీట్లు జూలై 24 తర్వాత ఖాళీ కానున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో నాలుగు సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో రెండు నామినేట్, ఒక సీటు ఖాళీ అవుతాయి. అప్పుడు మొత్తం సీట్లు 238కి తగ్గుతాయి. మెజారిటీ మార్క్ 120 అవుతుంది. అప్పటికీ బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిపి 105 మంది సభ్యులు ఉంటారు. ఐదుగురు నామినేటెడ్, ఇద్దరు స్వతంత్ర ఎంపీల మద్దతు కూడా బీజేపీకి దక్కడం ఖాయం. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 112కు చేరుతుంది. ఇది మెజారిటీ మార్కు కంటే ఎనిమిది తక్కువ. 


గుజరాత్‌ నుంచి జైశంకర్ రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు బాబు భాయ్ దేశాయ్, కేస్రీదేవ్ సింగ్ ఝాలా తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. విపక్షాల నుంచి అభ్యర్థులెవరూ లేకపోవడంతో బీజేపీ అభ్యర్థులు ముగ్గురు ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయబోమని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. 


Also Read: ORR Road Accident: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం  


Also Read: Lok Sabha Elections 2024: 350 స్థానాల్లో విజయమే లక్ష్యంగా.. లోక్‌సభ ఎన్నిలకు బీజేపీ యాక్షన్ ప్లాన్..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి