ORR Road Accident: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident At Shamirpet ORR: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ లారీ అదుపుతప్పి మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 17, 2023, 11:53 AM IST
ORR Road Accident: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident At Shamirpet ORR: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శామీర్‌పేట-కీసర మధ్యలో లియోనియా రిసార్ట్ వద్ద ఘట్‌కేసర్‌ నుంచి మేడ్చల్‌ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పింది. డివైడర్‌ పై నుంచి దూసుకువెళ్లి.. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం, కారును ఢీకొట్టింది. లారీ పొదల్లోకి దూసుకెళ్లగా.. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో లారీ డ్రైవర్,‌ బొలెరో వాహనంలోని ఇద్దరు ఉన్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

14 మందికి గాయాలు.. 

షాద్‌నగర్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి కలర్‌ మేకింగ్‌ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో 14 మంది గాయపడ్డారు. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు కెమికల్ రియాక్టర్‌లో పని చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని షాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స  అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!   

Also Read: Lok Sabha Elections 2024: 350 స్థానాల్లో విజయమే లక్ష్యంగా.. లోక్‌సభ ఎన్నిలకు బీజేపీ యాక్షన్ ప్లాన్..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News