Ram Madhav: బీజేపీలోకి రామ్ మాధవ్ రీ ఎంట్రీ.. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ మోడీ, షాల స్ట్రాటజీ అదేనా ..!
Ram Madhav: ‘ఆర్టికల్ 370’ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నగారా మోగింది. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలోకి మరోసారి రామ్ మాధవ్ ఎంట్రీ ఇవ్వడం కీలకంగా మారింది.
Ram Madhav: 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆగష్టు 5న జమ్మూ కాశ్మీర్ లోఆర్టికల్ 370, 35 A రద్దు చేస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేసింది. అంతేకాదు అప్పటి వరకు రాష్ట్ర హోదా ఉన్న జమ్మూ కశ్మీర్ ను జమ్మూ కశ్మీర్, లడ్డాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభిజించింది. అంతేకాదు 2019 అక్టోబర్ 30 నుంచి జమ్మూ కశ్మీర్, లడ్డాక్ మన దేశంలో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా గెజిట్ విడుదలైంది.
ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలు మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లాయి. దాదాపు ఐదేళ్లు అక్కడ రాష్ట్రపతి పాలన నడుస్తోంది. తాజాగా అక్కడ పరిస్థితులు అంతా అనుకూలంగా లేకపోయినా.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ దశాబ్దం తర్వాత ఎన్నికల నగారా మోగింది. రీసెంట్ గా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అక్కడ ప్రజలు స్వచ్ఛందంగానే వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి బీజేపీ నేత.. ప్రస్తుత ఆర్ఎస్ఎస్ లో కీలకనేత అయిన రామ్ మాధవ్ .. మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 నుంచి 2019 వరకు జమ్ము కాశ్మీర్ ఇంచార్జ్ గా పనిచేసిన రామ్ మాధవ్.. సొంతంగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదని చేసిన కామెంట్లతో సైలెంట్ అయ్యారు. అభిప్రాయ భేదాలతో రామ్ మాధవ్ ను మోడీ, షా పక్కన పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. ఐతే.. బీజేపీపై సంఘ్ మరోసారి తన పట్టును నిరూపించుకుంది. రామ్ మాధవ్ కు తాజాగా జమ్ము కాశ్మీర్ బీజేపీ బాధ్యతలు అప్పగించారు. రామ్ మాధవ్ తో పాటు.. కిషన్ రెడ్డికి కూడా ఇంచార్జ్ గా నియమించారు.
2014 ఎన్నికల తర్వాత బీజేపీ, పీడీపీ నేతృత్వంలో అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ఆయనే కీ రోల్ పోషించారు. అంతేకాదు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే జమ్మూ కశ్మీర్ లో ఉన్న లోటు పాట్లను గుర్తించారు. అంతేకాదు ఆర్టికల్ 370 రద్దు వెనకాల కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్ఎస్ఎస్ లోకి వెళ్లారు. మళ్లీ జమ్మూ కశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా తర్వాత జరగుతున్న ఎన్నికల వేళ రామ్ మాధవ్ బీజేపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కశ్మీర్ లోని 90 స్థానాలకు గాను మూడు విడుదలల్లో ఎన్నికల్లో నిర్వహించనుంది. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1వ తేదిన మూడో విడత ఎన్నికల జరగనున్నాయి. అక్టోబర్ 4వ తేదిన ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి. అయితే.. ఈ సారి ఎన్నికల్లో జమ్మూలో బీజేపీకి ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలున్నాయి. మరోవైపు కశ్మీర్ వ్యాలీలో నేషనల్ కాన్ఫిరెన్స్ అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతానికి తొలిసారి ఎన్నికలు జరగుతున్నాయి. ఈ సారి ఎస్సీ, ఎస్టీలకు యేడేడు సీట్లు చొప్పున మొత్తంగా దాదాపు 14 సీట్లు రిజర్వ్ చేశారు. అటు 24 సీట్లు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ కు రిజర్వ్ చేశారు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter