Ram Temple: రామమందిర ముహూర్తం అశుభం: శంకరాచార్య
రామజన్మభూమి ఆలయ నిర్మాణం ( Ram janma Bhoomi Ram Temple )పై ఇప్పుడు మరో వివాదం రేగుతోంది. అయోధ్య సాధుసంతువులు, రామజన్మభూమి ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం మంచిది కాదనే వాదన వస్తోంది. పెట్టుకున్న ముహూర్తం మంచిది కాదంటున్నారు ప్రముఖ పండితులు
రామజన్మభూమి ఆలయ నిర్మాణం ( Ram janma Bhoomi Ram Temple )పై ఇప్పుడు మరో వివాదం రేగుతోంది. అయోధ్య సాధుసంతువులు, రామజన్మభూమి ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం మంచిది కాదనే వాదన వస్తోంది.
అయోధ్యలో ( Ayodhya ) రామజన్మభూమి ఆలయ నిర్మాణానికి ఆగస్టు 5 వతేదీ ముహూర్తాన్ని ఖరారు చేసింది రామ జన్మభూమి ట్రస్ట్. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ ( PM Narendra Modi ) చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోదీ చేతుల మీదుగానే రామ మందిరానికి శంకుస్థాపన జరగాలనేది అయోధ్య సాధుసంతువుల ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పుడు ఈ ముహూర్తంపై వివాదం రేగుతోంది. ట్రస్ట్ కమిటీ నిర్ణయించిన రామ మందిర నిర్మాణ ముహూర్తం మంచిది కాదని..ఆ ఘడియలు అశుభమంటూ ప్రముఖ పండితులు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ( Shankaracharya Swaroopanand Saraswati ) సంచలన ప్రకటన చేశారు.
Also read: Ayodhya: రామ జన్మభూమి శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
ట్రస్ట్ పదవుల్ని తాము ఆశించడం లేదని..కమిటీ తమకు ఏ స్థానమూ వద్దని స్వామి స్పష్టం చేశారు. రామ మందిరాన్ని మంచి ఘడియల్లో నిర్మించాలనే తాము కోరుకుంటున్నామన్నారు. శంకరాచార్య స్వరూపానంద స్వామి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం రేపుతున్నాయి. Also read: Corona Virus: ఆ భారతీయులకు కరోనా సోకదు