భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అప్‌డేట్ చేశారు. దరఖాస్తుల తుది గడువును పొడిగించారు. ఆగస్టు 22న ఆర్బీఐలో ఉద్యోగాల దరఖాస్తు (RBI Recruitment 2020)కు గడువు ముగిసింది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 5 వరకు గడువు పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేని వారికి మరో అవకాశం దక్కినట్లయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 39 ఉద్యోగాలను భర్తీ (RBI Jobs 2020) చేస్తున్నారు. Hyderabad: వాచ్‌మెన్‌ను చితకబాదిన మహిళ.. Viral Video


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌ 9 పోస్టులు, కన్సల్టెంట్ 6 పోస్టులు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ 6 పోస్టులు, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ 5 పోస్టులు, డేటా అనలిస్ట్ 5 పోస్టులు సహా మొత్తం 39 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేపట్టారు. JEE Main Admit Card: జేఈఈ మెయిన్స్, NEET హాల్‌ టికెట్లు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి 


విద్యార్హత: సంబంధిత పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులను బట్టి అనుభవం తప్పనిసరి. ఆర్బీఐ వెబ్‌సైట్ (RBI Official Website)


దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.600 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల తుది గడువు సెప్టెంబర్ 5 అని మరిచిపోవద్దు. COVID19 Effect: భారత్‌లో 1.89 కోట్ల ఉద్యోగాలు మటాష్!


ఆర్బీఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ (RBI Notification for Jobs 2020


దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి - Click Here to Apply For RBI Posts 
COVID19 Deaths In India: భారత్‌లో 87శాతం కరోనా మరణాలు ఆ వయసు వారిలోనే..


Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం