Hyderabad: వాచ్‌మెన్‌ను చితకబాదిన మహిళ.. Viral Video

వాచ్‌మెన్‌ను ఓ మహిళ (woman thrashed a watchman) చితకబాదిన ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై వాచ్‌మెన్ ఫిర్యాదు చేశాడు.

Last Updated : Aug 26, 2020, 12:07 PM IST
  • వాచ్‌మెన్‌ను చితకబాదిన హైదరాబాద్ మహిళ
  • చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
  • అపార్ట్‌మెంట్‌కి వస్తూనే వాచ్‌మెన్‌పై విరుచుకు పడింది
  • చెప్పుతో కొట్టి, దూషిస్తూ వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు
Hyderabad: వాచ్‌మెన్‌ను చితకబాదిన మహిళ.. Viral Video

వాచ్‌మెన్‌ను ఓ మహిళ (woman thrashed a watchman) చితకబాదిన ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై వాచ్‌మెన్ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేయాలా వద్దా అని పోలీసులు కోర్టుకు లేఖ రాశారు. కోర్టు అనుమతి లభిస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే వాచ్‌మెన్‌ను మహిళ కాళ్లతో తన్నుతూ, చెప్పుతో కొడుతున్న సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Kollu Ravindra: సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి విడుదల

ఆ వివరాలిలా ఉన్నాయి...  చందానగర్‌లో సత్యవతి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఆమె కూతురు శ్రీలక్మి కూకట్‌పల్లిలోని లోద అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. తన తల్లిని కలుద్దామనుకున్న శ్రీలక్ష్మీ.. సత్యవతి ఉండే అపార్ట్మెంట్ కాల్ చేసి అమ్మ ఉన్నారా అని వాచ్‌మెన్ మహమ్మద్ రఫియాను అడగగా.. నేను మీ అమ్మకు కావలి ఉన్నానా అంటూ తన ఇష్టం వచ్చినట్లుగా సమాధానమిచ్చాడు. నేరుగా కారులో అపార్ట్‌మెంట్‌కి వస్తూనే శివంగిలా వాచ్‌మెన్‌పై విరుచుకు పడింది. COVID19 Deaths In India: భారత్‌లో 87శాతం కరోనా మరణాలు ఆ వయసు వారిలోనే..

కాళ్లతో తన్నుతూ, తన ఆవేశం చల్లారక చెప్పుతో కూడా కొట్టి, దూషిస్తూ వెళ్లిపోయిందని వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఐపీసీ సెక్షన్లు 323, 506 సెక్షన్ల కింద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే కేసు నమోదుకు కోర్టును పోలీసులు అనుమతి కోరారు.  SP Balu Health Update: చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు 
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండ

Trending News