జూన్ 30 నుంచి మార్కెట్లోకి Realme X3 స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్లు మీకోసం
ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మి (Realme) ఎక్స్ సిరీస్ (Realme X series) లో సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. రియల్ మి ఎక్స్ 3( Real me X3 ) , రియల్ మి ఎక్స్ 3 సూపర్ జూమ్ ( Realme X3 superzoom ) పేర్లతో మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఈ మోడళ్లలో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మి (Realme) ఎక్స్ సిరీస్ (Realme X series) లో సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. రియల్ మి ఎక్స్ 3(Real me X3) , రియల్ మి ఎక్స్ 3 సూపర్ జూమ్ (Realme X3 superzoom) పేర్లతో మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఈ మోడళ్లలో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. జూన్ 30 నుంచి భారతీయ మార్కెట్ లో అందుబాటులో వస్తున్న ఈ బ్రాండ్ కొత్త స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే హాట్ టాపిగ్‌గా మారాయి. ఇటు ఫీచర్ల పరంగా అటు ధర పరంగా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆకలినైన భరిస్తాం.. కానీ జొమాటోలో కొనసాగలేం..
రియల్ మి రెండు మోడళ్లలో లభ్యం కానుంది. ఆన్ లైన్ ద్వారా ఇండియాలో జూన్ 30 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. రియల్ మి ఎక్స్ 3 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో రూ.24, 999కు లభ్యం కానుంది. ఇదే మోడల్‌లో 8 జీబీ ర్యామ్ అయితే రూ.25, 999కు అందుబాటులో ఉంటుంది. కరోనాతో పోరాడి ఓడిన సీనియర్ వైద్యుడు..
ఇక రియల్ మీ ఎక్స్ 3 సూపర్ జూమ్ సైతం రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో 27 ,999 రూపాయలైతే... ఇదే మోడల్ లో 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కెపాసిటీతో రూ. 32, 999కు లభించనుంది.
ఈ రెండు మోడళ్ల ఫోన్లు ఫ్లిప్ కార్ట్, రియల్ మి అధికారిక వెబ్ సైట్ ద్వారా అందుబాటులో రానున్నాయి. జూన్ 27 నుంచి వీటికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) బ్యాంకు కార్డు ద్వారా 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తోంది. నటి డ్యాన్స్‌కు 24గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్
రియల్ మి ఎక్స్ 3లో ప్రత్యేకతలు (Realme x3 Specifications)
6.60 అంగుళాల డిస్ ప్లేతో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ కలిగి ఆండ్రాయిడ్ 10 వెర్షన్ తో లభిస్తుంది. హై రిజల్యూషన్ ( 1080 x 2400 ) పిక్సెల్స్ కలిగి ఉంటుంది.16+ 8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరాని కలిగిన ఈ మోడల్ 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
రియల్ మి ఎక్స్ 3 జూమ్ ప్రత్యేకతలు (Realme X3 SuperZoom Specifications)
6.60 అంగుళాల డిస్ ప్లేతో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 వెర్షన్‌తో హై రిజల్యూషన్ ( 1080 x 2400 ) పిక్సెల్స్ క్లారిటీతో ఉంటుంది. 32+8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరాను కలిగిన ఈ మోడల్ లో 64+8+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దీని బ్యాటరీ సామర్ధ్యం కూడా 4,200 ఎంఏహెచ్. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ