ఆకలినైన భరిస్తాం.. కానీ జొమాటోలో కొనసాగలేం..

లడఖ్‌లో చైనా సైన్యం 20 మంది భారతీయ సైనికులను హతమార్చినందుకు నిరసనగా కోల్‌కతాలోని జోమాటో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం ఉద్యోగుల బృందం శనివారం వారి టీషర్టులను కాల్చి నిరసన తెలియజేశారు.

Updated: Jun 28, 2020, 04:15 PM IST
ఆకలినైన భరిస్తాం.. కానీ జొమాటోలో కొనసాగలేం..

హైదరాబాద్: లడఖ్‌లో చైనా సైన్యం 20 మంది భారతీయ సైనికులను హతమార్చినందుకు నిరసనగా కోల్‌కతాలోని జోమాటో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం ఉద్యోగుల బృందం శనివారం వారి టీషర్టులను కాల్చి నిరసన తెలియజేశారు. బెహాలాలో జరిగిన నిరసన సందర్భంగా వారిలో కొందరు జోమాటోకు చైనా పెట్టుబడి గణనీయంగా ఉన్నందున వారు తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టారని, సంస్థ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయకుండా ప్రజలు నిరసన తెలపాలని కోరారు. నటి డ్యాన్స్‌కు 24గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్

Also Read:  కటింగ్ చేయించుకోవాలంటే అపాయింట్‌మెంట్!

2018లో చైనాకు చెందిన అలీబాబాలో భాగమైన యాంట్ ఫైనాన్షియల్ 14.7 శాతం వాటా కోసం 210 మిలియన్ డాలర్లు జోమాటోలో పెట్టుబడి పెట్టింది. ఫుడ్ డెలివరీ వ్యాపారమే ప్రధానంగా ఇటీవల యాంట్ ఫైనాన్షియల్ నుండి అదనంగా 150 మిలియన్ డాలర్లు సేకరించారు. అయితే  చైనా కంపెనీలు ఇక్కడి నుండి లాభం పొందుతూ మన దేశ సైన్యంపై దాడికి దిగుతున్నాయని అంతేకాకుండా భారత భూభాగాన్ని ఆక్రమించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని నిరసనకారులలో ఒకరు అన్నారు. ఆకలితో ఉండటానికైనా సిద్ధంగా ఉన్నామని, చైనా నుండి పెట్టుబడులున్న సంస్థలలో పనిచేయబోమని తెలిపారు. ఇదిలాఉండగా కరోనావైరస్ మహమ్మారి కారణంగా మే నెలలో జోమాటో 520 మంది ఉద్యోగులను సుమారుగా 13 శాతం మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే..  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ