Republic TV CEO Vikash Khanchandani arrested: టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌ (TRP SCAM) కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లిక్‌ టీవీ సీఈవో వికాస్‌ ఖాన్‌చందానీ (Republic TV CEO Vikash Khanchandani)ని ముంబై పోలీసులు ఆదివారం (డిసెంబర్ 13న) అరెస్టు చేశారు. టీఆర్పీ కుంభకోణం వ్యవహారంలో ఇదివరకే పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైు రిపబ్లిక్‌ టీవీ (Republic TV) వెస్ట్ డివిజన్ డిస్ట్రిబ్యూషన్‌ అధినేత ఘన్‌శ్యామ్‌ సింగ్‌ను మహారాష్ట్ర పోలీసులు నవంబర్‌లో అరెస్ట్ చేశారు. అయితే అనంతరం ఆయన బెయిల్ పిటిషన్‌కు ఆమోదం రావడం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఫేక్ టీఆర్పీలపై ఎప్పటినుంచో పలు మీడియా సంస్థలు, యాజమాన్యాలపై తరచుగా విమర్శలు, ఆరోపణలు వస్తుంటాయి. ఈ క్రమంలో హన్సా రీసెర్చి గ్రూప్‌ రిపబ్లిక్ టీవీ (Republic TV)పై ఫిర్యాదు చేసింది. బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చి కౌన్సిల్‌(BARC) కోసం హన్సా గ్రూప్ సేవలు అందిస్తుంది. హన్సా గ్రూప్ ఫిర్యాదు మేరకు అక్టోబర్‌ నెలలోనే రిపబ్లిక్‌ టీవీపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు జరిగింది.
Also Read: Solar Eclipse 2020 Date and Timings: చివరి సూర్యగ్రహణం.. భారత్‌లో  పరిస్థితి ఏంటంటే! 



లేనిపోని టీఆర్పీ రేటింగ్‌ను రిపబ్లిక్‌ టీవీతో పాటు మరో రెండు టీవీ ఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని ముంబై సీపీ పరం వీర్‌సింగ్ సైతం స్వయంగా ప్రకటించారు.  మరోవైపు రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి సైతం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మోసానికి పాల్పడ్డారని, దీంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమయ్యారనే కేసులో అరెస్ట్ కావడం తెలిసిందే. ప్రభుత్వం ఉద్దేశపూర్వంగానే రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేసుకుందని దాని యాజమాన్యం ఆరోపిస్తోంది.


Also Read: Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం ప్రభావం! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook