Uk Corona strain: యూకే కరోనా స్ట్రెయిన్ ఇండియాలో కలవరం కల్గిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


యూకే ( UK ) నుంచి ప్రారంభమైన కొత్త కరోనా స్ట్రెయిన్ ( New coronavirus strain ) ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో యూకే కరోనా స్ట్రెయిన్ కేసులు 109కు చేరుకున్నాయి. జనవరి 11వ తేదీకి 96 ఉన్న కేసులు..కేవలం మూడ్రోజుల్లోనే అంటే జనవరి 14 నాటికి 109కు చేరుకోవడం గమనార్హం. ఇదే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Union health ministry ) కలవరానికి కారణమైంది. యూకే కరోనా స్ట్రెయిన్ ( Uk corona strain )  బ్రిటన్‌లో ప్రారంభమైనప్పటి నుంచే ఇండియా యూకేకు విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఇటీవల జనవరి 8 నుంచి తిరిగి ప్రారంభించినా...పూర్తిగా నిబంధనలు పాటిస్తూ నడుపుతోంది. 


యూకే నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్ ( Airport ) ‌లోనే పరీక్షలు నిర్వహించి 14 రోజుల క్వారెంటైన్ పాటించేలా చర్యలు తీసుకుంటోంది.  యూకే స్ట్రెయిన్ ప్రభావం ఇప్పటికే అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలకు సోకింది. ఫలితంగా ఈ దేశాల్లో కొత్తగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. 


Also read: Corona Vaccine: అన్ని రాష్ట్రాలు రెడీ.. తొలి దశలో 1.65 కోట్ల టీకాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook