Crime services rates: ధమ్కీ నుంచి మర్డర్ వరకు ఇక్కడ ఒక్కో నేరానికి ఒక్కో రేటు
``చెయ్యి తీసేయడానికి ఓ రేటు, కాలు తీసేయడానికి ఓ రేటు.. ఏకంగా తలే తీసేయాలనుకుంటే దానికి ఇంకో రేటు`` అని సినిమాల్లో రౌడీలు చెప్పడం చూస్తుంటాం. కానీ ఇదిగో ఇక్కడ ఓ నేరస్తుడు ( Criminal ) మాత్రం ఏకంగా రియల్ లైఫ్‌లోనే ఆ సీన్‌ని నిజం చేసి చూపించాడు. ఇక్కడ అన్నిరకాల నేరాలు చేయబడును అని తమ వద్ద లభించే సేవలతో కూడిన ధరల పట్టికను ఏర్పాటు చేసుకుని మరీ నేరాలు చేస్తున్నాడు.
ముఝఫర్‌పూర్: ''చెయ్యి తీసేయడానికి ఓ రేటు, కాలు తీసేయడానికి ఓ రేటు.. ఏకంగా తలే తీసేయాలనుకుంటే దానికి ఇంకో రేటు'' అని సినిమాల్లో రౌడీలు చెప్పడం చూస్తుంటాం. కానీ ఇదిగో ఇక్కడ ఓ నేరస్తుడు ( Criminal ) మాత్రం ఏకంగా రియల్ లైఫ్‌లోనే ఆ సీన్‌ని నిజం చేసి చూపించాడు. ఇక్కడ అన్నిరకాల నేరాలు చేయబడును అని తమ వద్ద లభించే సేవలతో కూడిన ధరల పట్టికను ఏర్పాటు చేసుకుని మరీ నేరాలు చేస్తున్నాడు. అవును మీరు చదివింది నిజమే.. ఉత్తర్ ప్రదేశ్‌లో క్రైమ్ రేటు పెరుగుతోంది అనేది అక్కడ తరచుగా ప్రతిపక్షాలు చేసే విమర్శ. ఆ క్రైమ్ రేటు పరిస్థితి ఎలా ఉన్నా.. నేరస్తులు మాత్రం చట్టాలకు భయపడకుండా పబ్లిక్‌గానే తమ నేరాలను చక్కబెట్టుకుంటున్నారు. అందుకు సాక్ష్యమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ధరల పట్టిక ( Crime services price chart).
Also read : karwa chauth in jail: జైలులోనే మహిళా ఖైదీల కర్వా చౌత్ వేడుకలు
ఇక్కడ అన్ని నేరాలు చేయబడును.. ఒక్కో నేరానికి ఒక్కో రేటు.. అంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఓ నేరస్తుడు. ధమ్కీ ఇవ్వడం నుంచి మొదలుకుని దాడి చేయడం, గాయపర్చడం, మర్డర్ ( Murder ) చేయడం వరకు అన్ని సేవలు లభిస్తాయి. ధమ్కీ ఇవ్వడానికి రూ.1000, దాడి చేయడానికి రూ.5000, గాయపర్చడానికి రూ.10 వేలు, ఆఖరికి హత్య చేయడానికి అయితే రూ.55 వేలు తీసుకుంటాం అంటూ ప్రచారం చేసుకుంటోంది ముఝఫర్‌పూర్‌కి చెందిన గ్యాంగ్‌స్టర్ ముఠా.
Also read : Illicit liquor: కల్తీ మద్యం కాటుకు 20 మంది మృత్యువాత
ఆర్డర్ ఇవ్వండి చాలు... ఆయుధాలు మావే అని ఆఫర్స్ కూడా ఇస్తున్నాయి. భూవివాదాలు ( Land disputes ) సైతం తీరుస్తాం అని సుపారీ ఇచ్చే పార్టీల కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ కస్టమర్లను వెతుక్కుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్టు పోలీసుల వరకు వెళ్లడంతో ఎట్టకేలకు నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. చరత్‌వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చౌకాడ గ్రామానికి చెందిన యువకుడు ఈ పోస్టు పెట్టినట్టు తెలుస్తోంది. సదరు యువకుడు పీఆర్డీ జవాన్ కుమారుడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read : Mahesh Babu for Uppena: మెగా హీరో చిత్రానికి మహేష్ బాబు ప్రమోషన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe