Mahesh Babu for Uppena: మెగా హీరో చిత్రానికి మహేష్ బాబు ప్రమోషన్స్

మెగా ఫ్యామిలీ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి ( Kriti Shetty ) కూడా ఈ సినిమా ద్వారానే తొలి పరిచయం అవుతోంది. ఈ సినిమాలోని పాటలు విడుదలకు ముందే ఎంతో పాపులర్ అయ్యాయి.

Last Updated : Nov 5, 2020, 02:57 AM IST
Mahesh Babu for Uppena: మెగా హీరో చిత్రానికి మహేష్ బాబు ప్రమోషన్స్

మెగా ఫ్యామిలీ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి ( Kriti Shetty ) కూడా ఈ సినిమా ద్వారానే తొలి పరిచయం అవుతోంది. ఈ సినిమాలోని పాటలు విడుదలకు ముందే ఎంతో పాపులర్ అయ్యాయి.

కరోనా వైరస్ ( Coronavirus pandemic ) సమస్య లేకపోతే ఏప్రిల్ తొలి వారంలోనే ఉప్పెన సినిమా విడుదల కావాల్సిఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్త్తం పూర్తి చేసుకొని విడుదలకు ( Uppena movie release ) సిద్ధంగా ఉంది. వైష్ణవ్ తేజ్‌కి ఇదే తొలి సినిమా కావడంతో ఈ సినిమాను ఎలాగైనా థియేటర్స్‌లోనే విడుదల చేయాలని ఈ చిత్ర బృందం యోచిస్తోంది. 

Also read : Niharika's wedding venue: ఉదయ్‌పూర్‌లో నిహారిక పెళ్లి.. తేదీ, వేదిక ఫిక్స్ !

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ( DSP music ) కంపోజ్ చేసిన ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మొదట రిలీజ్ చేసిన ‘నీ కన్ను నీలి సముద్రం’ ( Nee kannu neeli Samudram song ) పాటకు ఇప్పటికే భారీ స్పందన లభించి సూపర్ హిట్ అయ్యింది. రెండవ పాట ‘ధక్ ధక్ ధక్’ సాంగ్ ( Dhak Dhak dhak song ) కూడా సంగీత ప్రియులకు బాగా నచ్చింది.

తాజా అప్‌డేట్ ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలోని మూడో పాటను విడుదల చేయబోతున్నారు ( Mahesh Babu to lauch Uppena third song ). నవంబర్ 11న సాయంత్రం 4:05 గంటలకు ఉప్పెన సినిమాలోని మూడవ పాటను విడుదల చేయబోతున్నారు. ఉప్పెన మూవీ నుంచి మూడో పాటను మహేష్ బాబు లాంచ్ చేయడాన్ని మెగా స్టార్ మేనల్లుడికి సూపర్ స్టార్ ఇస్తున్న క్రాస్ ప్రమోషన్స్‌గా సినీవర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Photo gallery : Karva Chauth 2020 pics: కర్వా చౌత్ ప్రత్యేకతను చూపించిన బాలీవుడ్ చిత్రాలు.. ఫోటోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News