karwa chauth in Lucknow jail: కర్వా చౌత్ అంటే ఉత్తరాదిన మహిళలకు అత్యంత పవిత్రమైన పర్వదినం. తన భర్త యోగక్షేమాలు కోరుతూ ప్రతీ మహిళ ఆరోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూశాకే ఆ ఉపవాసదీక్ష విడవడంతో పాటు చంద్రుడిని చూసిన తర్వాత ముందుగా భర్త ముఖమే చూసి అతడి ఆశీస్సులు తీసుకోవడం అనేది కర్వా చౌత్ పండగ విశిష్టతల్లో ముఖ్యమైనది. అందుకే మహిళల మనోభావాలను గౌరవిస్తూ ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న నారీ బంది నికేతన్ ( Nari Bandi Niketan ) మహిళల జైలులో మహిళా ఖైదీలు కర్వా చౌత్ జరుపుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. Also read : What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్ ప్రాముఖ్యత ఏంటి ? కర్వాచౌత్‌కి అట్లతద్దికి సంబంధం ఏంటి ?
కర్వా చౌత్ ఆచరించే మహిళల కోసం కర్వా చౌత్ పూజ సామాగ్రి ( karwa Chauth pooja ) అంతా సమకూర్చిన అధికారులు.. వారి కోసం జైలు ఆవరణలోనే అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జైలు అధికారుల పుణ్యమా అని అక్కడ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న మహిళలు బుధవారం కర్వా చౌత్ పర్వదినాన్ని వేడుకగా జరుపుకున్నారు.
#WATCH Lucknow: Women prisoners, lodged at Nari Bandi Niketan, celebrated #KarvaChauth in the jail premises yesterday. (Video source: Jail administration) pic.twitter.com/yAkxbOyXd2
— ANI UP (@ANINewsUP) November 5, 2020
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ కేసుల్లో ఐదేళ్లకుపైగా శిక్ష అనుభవించే మహిళా ఖైదీలను అందరినీ ఒక్క చోటుకు చేర్చే ఈ జైలు పేరే నారీ బంధీ నికేతన్. Photo gallery : Karva Chauth 2020 pics: కర్వా చౌత్ ప్రత్యేకతను చూపించిన బాలీవుడ్ చిత్రాలు.. ఫోటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe