రాజస్థాన్ ( Rajasthan ) ప్రభుత్వ సంక్షోభం నేపధ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్ పైలట్ వెనక్కి తగ్గకపోవడంతో పాటు రెండోసారి ఏర్పాటు చేసిన శాసన సభాపక్ష సమావేశానికి కూడా హాజరుకాలేదు. అటు ప్రభుత్వానికి మెజార్టీ ఉందని పార్టీ భావించడంతోనే ఈ చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ( Deputy cm Sachin pilot ) ను ఆ పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సంక్షోభం నేపధ్యంలో రెండోసారి ఏర్పాటైన శాసనసభా పక్ష సమావేశానికి కూడా  సచిన్  హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ( Randeep Surjewala ) ఈ మేరకు వెల్లడించారు. అటు పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా సచిన్ పైలట్ ను తొలగిస్తున్నట్టు  కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు. గోవింద్ సింగ్ దోతాస్రాను సచిన్ పైలట్ స్థానంలో నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రెండోసారి నిర్వహించిన శాసన సభా పక్ష సమావేశంలో 102 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు ఏఎన్ఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమావేశంలో అత్యధిక శాతం ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ ( Sachin pilot ) ను పార్టీ నుంచి పదవుల్నించి తొలగించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. సచిన్ పైలట్ తో పాటు అతని మద్దతు పలికిన ఇద్దరు మంత్రులు విశ్వేందర్ సింగ్, రమేష్ మీనాలను మంత్రి పదవుల్నించి తొలగించారు. Also read: Sachin Pilot: ఎవరీ సచిన్ పైలట్? ఎందుకీ వివాదం?


జైపూర్ లోని ఫెయిర్ మౌంట్ హోటల్ లో జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకావల్సిందిగా సచిన్ పైలట్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తదితరులు సచిన్ ను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే సచిన్ మాత్రం ఒప్పుకోలేదు. సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేదు. చివరి వరకూ ప్రయత్నించిన తరువాతే పార్టీ ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ ప్రభుత్వానికి మెజార్టీ పూర్తిగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. Also read: Rajasthan కాంగ్రెస్‌‌కు పూర్తి మెజార్టీ ఉంది: రణ్‌దీప్ సుర్జేవాలా