SBI Clerk Prelims Result 2020: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఎస్‌బీఐ (SBI) దేశవ్యాప్తంగా జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులు భర్తీ చేపట్టింది. ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు (SBI Clerk Prelims Result 2020) మంగళవారం విడుదలయ్యాయి. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల కోసం అక్టోబర్ 20 నుంచి ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
SBI Clerk Prelims Results 2020: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ (SBI) దేశవ్యాప్తంగా జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులు భర్తీ చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22, 29, మార్చి 1, 8 తేదీల్లో నిర్వహించిన ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు (SBI Clerk Prelims Result 2020) మంగళవారం విడుదలయ్యాయి. ఎస్‌బీఐ (SBI) వెబ్‌సైట్‌లో అభ్యర్థుల కోసం అక్టోబర్ 20 నుంచి ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఎస్‌బీఐ క్లర్క్ ఫలితాలు 2020 కోసం క్లిక్ చేయండి
పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేక రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేక పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు క్లర్క్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. వీరికి అక్టోబర్ 31వ తేదీన ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్‌ను అక్టోబర్ 31న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుత జాబ్స్ భర్తీలో తెలుగు రాష్ట్రాలకు 525 పోస్టులను కేటాయించారు. వీటిలో తెలంగాణకు 375 పోస్టులు, ఏపీకి 150 పోస్టులు కేటాయించారని తెలిసిందే. కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) 8,134 పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా, 134 బ్యాక్‌లాగ్ పోస్టులు, స్పెషల్ రిక్రూట్‌మెంట్ పోస్టులు 130 వరకు ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్ https://www.sbi.co.in/careers
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe