SBI Warning to Customers: ఒకప్పుటి కాలంలో దారి దోపిడీలు ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో ఏం దోపిడీ చేయాలన్నా ఆన్లైన్లోనే బ్యాంక్ అకౌంట్ల నుంచి దోచేస్తున్నారు కేటుగాళ్లు. ఒక రకమైన మోసం గురించి బ్యాంకులు అలాగే పోలీసులు హెచ్చరించి అందర్నీ చైతన్యవంతులను చేస్తున్నాం అనుకునే లోపే మరో కొత్త దోపిడీ పద్ధతితో రంగంలోకి దిగుతున్నారు కేటుగాళ్లు. ఈ మధ్య కాలంలో బాగా సైబర్ క్రైమ్ సహా డిజిటల్ మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ దగ్గర సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు కొన్ని కీలకమైన సూచనలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలలో అనఫీషియల్ లావాదేవీలు ఏవైనా జరిగినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. అలా చేసినప్పుడే ఇంటర్నెట్ ఫిషింగ్ అలాగే బ్లాక్ మెయిలింగ్ వంటి విషయాలలో సైబర్ కేటుగాళ్ల నుంచి సేఫ్ గా ఉండవచ్చని సూచించింది. ఎస్బిఐ ఖాతాదారులు తమ ఖాతా నుంచి కనుక డబ్బులు పోగొట్టుకున్నట్లయితే కచ్చితంగా తమ దృష్టికి తీసుకురావాలని ఫిర్యాదు చేయాలని సూచించింది. తాము మోసపోయాం అని ఖాతాదారుడు అర్థం చేసుకున్న వెంటనే అది తమ దృష్టికి తీసుకువస్తే డబ్బు వెనక్కి తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయని సమయం గడిచిన కొద్దీ ఆ డబ్బు రాబట్టే విషయంలో కష్టమవుతుందని చెప్పుకొచ్చారు.


అలా ఎవరైనా కస్టమర్ తమ ఖాతాలో ఏదైనా అనధికార లావాదేవీని గమనించిన  వెంటనే తమ టోల్-ఫ్రీ నెంబర్ 18001-2-3-4కు కాల్ చేసి అలర్ట్ చేయాలని వెల్లడించింది. ఇలా కనుక చేస్తే తాము సకాలంలో సరైన చర్యలు తీసుకునే అవకాశం తమకు ఉంటుందని, లేకుంటే భారీ మూల్యం తప్పదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. 1800 1234 లేదా 1800 2100లో తమ కాంటాక్ట్ సెంటర్‌ టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి ఎస్‌బీఐ బ్యాంకింగ్ అవసరాలను కూడా తీర్చుకోవచ్చు అని చెబుతూ  ట్వీట్‌ చేసింది.


పెరుగుతున్న ఈ ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలలో  సైబర్‌  నేరగాళ్ల  ఎత్తుల నుంచి, సైబర్ దాడుల నుంచి కస్టమర్లు తమని తాము రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఎస్బిఐ తమ ప్రకటనలో పేర్కొంది. ఇక కేవలం టోల్-ఫ్రీ నంబర్‌కు డయల్ చేసి ఊరుకోవడంతో పాటు, కస్టమర్‌లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, భీమ్‌ ఎస్‌బీఐ పే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా కూడా రిజిస్టర్ చేయవచ్చని ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత లింకును పూర్తిగా బ్లాక్‌ చేస్తామని ఎస్‌బీఐ వెల్లడించింది.


ఇక ఆ ఫిర్యాదు తాము అందుకున్న వెంటనే ఆ రిజిస్టర్డ్ ఫిర్యాదు నంబర్, ఇతర వివరాలను కస్టమర్‌కు ఎస్‌ఎంఎస్‌, ఇమెయిల్ ద్వారా అందిస్తామనీ, అలా వచ్చిన ఫిర్యాదును 90 రోజుల్లో పరిష్కరిస్తామని ఎస్బిఐ తమ ఖాతాదారులకు నమ్మకం కల్పించే ప్రయత్నం చేసింది. సో ఇకమీదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఎస్బిఐ దృష్టికి తీసుకువస్తే వాటిని వెనక్కి రాబట్టే అవకాశం ఉంటుంది.


Also Read: Jabardasth Bhavani Naidu Hot: జబర్దస్త్ లో కనిపించే ఈ అమ్మాయిని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?


Also Read: Krithy Shetty Saree Photos: చీరకట్టులో కృతి శెట్టి క్యూట్ ఫోటోలు.. కవ్వించి చంపేస్తోందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook