శివసేన ఫైర్ బ్రాండ్ ( Shivsena fire brand sanjay raut ) సంజయ్ రౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన ఎ ప్రామిస్డ్ ల్యాండ్ లో ప్రస్తావిత విషయాలపై  ఏకంగా ఒబామాపై విమర్శలు ఎక్కుపెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఎ ప్రామిస్డ్ ల్యాండ్ ( A Promised Land ) . ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న పుస్తకం పేరు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( America Ex president Barack obama ) రాసిన పుస్తకమిది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, ఆయా దేశాల గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకంపై కొన్ని విమర్శలు..కొంత ప్రశంస వస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) గురించి ఒబామా తన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. 


ఇచ్చిన పని పూర్తి చేసిన విద్యార్ధి..ఉపాధ్యాయుడి మెప్పు కోసం ఎలా ఆరాటపడతాడో అది తప్ప..ప్రావీణ్యత సంపాదించాలనే తపన రాహుల్ గాంధీలో లేదని ఒబామా తన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ విషయాన్నే ఇప్పుడు సంజయ్ రౌత్ ( Sanjay raut ) తప్పుబడుతున్నారు.


ఓ విదేశీ నేత..భారత రాజకీయ నేతలపై అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సంజయ్ రౌత్ తెలిపారు. అది చాలా అసహ్యకరంగా ఉంటుందని మండిపడ్డారు. డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) పిచ్చివాడని మేం అనలేం కదా అని అన్నారు. అసలు ఒబామాకు భారతదేశం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. 


ఈ నెల 17న మార్కెట్ లో విడుదల కానున్న ఎ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో ఒబామా..తన బాల్యం, రాజకీయ ప్రస్థానంతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూాడా ప్రస్తావించారు. Also read: Diwali in India: దేదీప్యమానంగా వెలుగులు జిమ్ముతున్న పర్యాటక ప్రాంతాలు