Sidhu Moose Wala Murder: పంజాబ్‌లో సంచలనం రేపిన ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత శుభదీప్ సింగ్ సిద్దూ అలియాస్ సిద్ధూ మూసే వాలా హత్యపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధూ హత్యను సీఎం ఖండించారు. సిద్ధూ గొప్ప ఆర్టిస్ట్ అని... పంజాబ్ కల్చరల్ ఐకాన్ అని కొనియాడారు. సిద్ధూకి తనిచ్చే గౌరవం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుందన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని వాహెగురుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ హేయమైన చర్యకు పాల్పడిన నేరస్తులను ప్రభుత్వం వదిలిపెట్టదని భగవంత్ మాన్ పేర్కొన్నారు. సిద్ధూ మూసే వాలా తండ్రి విజ్ఞప్తి మేరకు ఈ హత్య ఘటనపై పంజాబ్-హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు. సిద్ధూ హత్య కేసు విచారణకు ప్రభుత్వం తరుపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని... ఎన్ఐఏ లాంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల సహకారం కూడా అందేలా చూస్తామని చెప్పారు. సిద్ధూకి సెక్యూరిటీ తగ్గించడంపై అత్యున్నత స్థాయి విచారణకు ఇప్పటికే ఆదేశించామని... బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చామని తెలిపారు. 


సీఎం ఆదేశాల మేరకు సిద్ధూ హత్య ఘటనపై రాష్ట్ర డీజీపీ వీకే భవ్రా నిన్నటి (మే 30) ప్రెస్‌ మీట్‌లో ప్రస్తావించిన పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. సిద్ధూ మూసే వాలా ఒక గ్యాంగ్‌స్టర్ అని కానీ అతనికి గ్యాంగ్‌స్టర్స్‌తో సంబంధాలున్నాయని కానీ తానెక్కడా పేర్కొనలేదన్నారు. ఒక వర్గం మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని... సిద్ధూ అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రకటనలు చేస్తున్నారని... దానికి కౌంటర్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. వన్ గోల్డీ బ్రార్ అనే వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరుపున తామే హత్యకు పాల్పడినట్లు ప్రకటించాడని చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని... నిందితులను అరెస్ట్ చేసి న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు.  


Also Read: Hardik Pandya Celebrations: వైరల్ వీడియో.. భావోద్వేగాన్ని ఆపుకోలేక భార్యను గట్టిగా.!


Also Read: Whiskey Bottle Auction: ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్.. వేలంలో రూ.10 కోట్లకు విక్రయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook