Rape and Murder: ఆరేళ్ల బాలికపై 38 ఏళ్ల వ్యక్తి హత్యాచారం-ట్రంకు పెట్టెలో మృతదేహం
Girl raped and Murdered in UP: యూపీలో మరో దారుణం వెలుగుచూసింది. ఆరేళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. బాలిక మృతదేహాన్ని నిందితుడు ట్రంకు పెట్టెలో కుక్కాడు. ఇంటి నుంచి సమీపంలోని షాపుకు వెళ్లిన బాలికను మాయ మాటలతో అతను ఆకర్షించాడు.
Girl raped and Murdered in UP: ఉత్తరప్రదేశ్‌లో మరో హత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై 38 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి (Sexual Assault) పాల్పడ్డాడు. ఆపై బాలికను హతమర్చి.. మృతదేహాన్ని ట్రంకు పెట్టెలో కుక్కేశాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని పట్టుకుని చంపేందుకు స్థానికులు యత్నించగా... పోలీసులు అతన్ని సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హాపూర్ పట్టణంలో ఓ కాలనీలో అంజద్ (38) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజద్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతని భార్య, పిల్లలు ఊరెళ్లడంతో కొద్దిరోజులుగా ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు.
ఇదే క్రమంలో గత గురువారం తన ఇంటి ముందు నుంచి ఓ ఆరేళ్ల బాలిక సమీపంలోని షాపుకు వెళ్లడం గమనించాడు. బాలిక తిరిగొచ్చే సమయంలో మాయ మాటలు చెప్పి ఆమెను ఆకర్షించాడు. ఆపై ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి (Rape in Uttar Pradesh) పాల్పడ్డాడు. అనంతరం బాలికను హత్య చేసి... మృతదేహాన్ని ట్రంకు పెట్టెలో కుక్కాడు.
ఇంటి నుంచి షాపుకు వెళ్లిన బాలిక (Minor girl raped) ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో మరుసటి రోజు హాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో శనివారం (డిసెంబర్ 4) ఉదయం నిందితుడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగా... ఇంటి గేటుకు తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లగా... ట్రంకు పెట్టెలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read: SEX on number plate: స్కూటీ నంబర్ ప్లేట్‌పై SEX-ఆర్టీవోకి మహిళా కమిషన్ నోటీసులు
నిందితుడు అంజద్‌ను హాపూర్ పట్టణంలోని త్రిలోకిపురా ప్రాంతంలో అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అంజద్ నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన సమయంలో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశంతో అతనిపై దాడికి యత్నించినట్లు ఏఎస్పీ మిశ్రా తెలిపారు. ఆ సమయంలో తాము లేకపోయి ఉంటే ఆ మూక చేతిలో నిందితుడు హతమయ్యేవాడని అన్నారు. నిందితుడు డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలిపారు. బాధిత బాలిక ఇల్లు నిందితుడి ఇంటికి కేవలం 50మీ. దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో (Rape Incident) పాటు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook