న్యూ ఢిల్లీ: కరోనావైరస్‌ ( Coronavirus) సోకి మృతి చెందిన వారిలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టిన ప్రధానమైన సమస్య ఏదైనా ఉందా అంటే అది శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారడమే. కరోనావైరస్ ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత ఊపిరితిత్తులపైనే ( Coronavirus impact on Lungs) అధిక ప్రభావం చూపించడమే అందుకు కారణం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలావుంటే, సాధారణంగానే సిగరెట్లు, బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులు ( Tobacco products) ఉపయోగించే వారిలోనూ ఊపిరితిత్తులు దెబ్బతినడం సాధారణంగా చూస్తున్న సమస్యే. ఐతే, అలా సిగరెట్స్, హుక్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారిన వారికి కరోనావైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ పొగాకు ఉత్పత్తులను వినియోగించడం ద్వారా శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధుల తీవ్రత అధికమవుతుందని, తద్వారా వారు కొవిడ్‌-19 ( COVID-19 ) బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. Also readమీ ప్యాకెట్ పాలు Coronavirus నుండి సురక్షితమేనా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cigarette smoking అలవాటు ఉన్న వారిపై కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని, వారు చనిపోయే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వారు సిగరెట్లను చేతితో పట్టుకుని నోట్లో పెట్టుకుంటారు కనుక అలా వైరస్‌ వారి నోట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అదేవిధంగా హుక్కా తాగే అలవాటు ఉన్న వారు కూడా ఒకే గొట్టాన్ని ఒకరికంటే ఎక్కువ మంది పదేపదే ఉపయోగిస్తారు. అదే క్రమంలో అందులో ఎవరికైనా కరోనా సోకి ఉన్నట్టయితే... వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది అని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. Also read: How to check BP: హై బీపీకి చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే


గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్‌ సమస్యకు పొగాకు ఉత్పత్తుల అలవాటు ఓ ప్రధాన కారకమని, ఈ వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే.. వారు తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది.


పొగాకులోని రసాయనాలు శరీరంలోని రోగ నిరోధక కణాల యాక్టివిటీని మందగించేలా చేస్తాయని, ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గి ( Tobacco kills immunity ) కరోనావైరస్తో పోరు కష్టతరం అవుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది. Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు