సుపరిపాలన అందించే రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఉత్తరాది రాష్ట్రాలు అట్టడుగున చేరాయి. ది పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020 ( The public affairs index 2020 ) విడుదల చేసిన ర్యాకింగులివి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సమానత్వం అంటే అన్ని వర్గాల్నిధనిక, కుల మత తేడాల్లేకుండా సమానంగా న్యాయం అందించడం. అభివృద్ధి సూచిలో పెరుగుదల అంటే విభిన్న రంగాల్లో నిరంతరం అభివృద్ధి కన్పించడం. ఇక సుస్థిరత అంటే పాలనాపరంగా ప్రభుత్వం స్ధిరంగా ఉండటం, నిర్ణయాలు తీసుకుని అమలు చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉండటం వంటివి. ఈ మూడు అంశాల్ని పరిగణలో తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ( ISRO Ex chairman kasturi rangan ) నేతృత్వంలో నడుస్తున్న స్వచ్ఛంధ సంస్థ  ప్రతియేటా ది పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఈ యేడాది అంటే ది పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020 విడుదలైన జాబితా ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు అగ్రస్థానం దక్కింది. అటు ఉత్తరాది రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి.


కేరళ రాష్ట్రానికి ( Kerala in Top ) దేశంలోనే ప్రధమ స్థానం దక్కింది. అటు తమిళనాడు రెండవస్థానంలో, ఆంధ్రప్రదేశ్ ( Ap in third place ) మూడవ స్థానంలో, కర్ణాటక నాలుగవ స్థానంలో నిలిచాయి. దేశంలోనే అత్యదిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ( Up in last place ) నిలిచింది. ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు నెగెటివ్ పాయింట్లు రావడంతో చివర్లో నిలిచాయి. మరోవైపు చిన్న రాష్ట్రాల కేటగిరీలో గోవా 1.745 పాయింట్లతో అగ్రస్థానం ఆక్రమించగా, మేఘాలయ ( 0.797 ) రెండవస్థానాన్ని, హిమాచల్‌ ప్రదేశ్‌ ( 0.725 ) మూడవ స్థానాన్ని సాధించాయి. అయితే ఇదే కేటగరీలో మణిపూర్ ( -0.363 )‌, ఢిల్లీ ( -0.289 ), ఉత్తరాఖండ్‌ ( -0.277 ) పూర్తిగా వెనుకబడ్డాయి.  కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం చండీగఢ్‌ (1.05 ) మొదటి స్థానంలో నిలిచింది. Also read: Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!