SSC Gd Constable Recruitment 2022 Notification: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (GD), సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF), SSF, రైఫిల్‌మ్యాన్ (అస్సాం రైఫిల్) సహా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. SSC ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను చెక్ చేసి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యమైన తేదీలు 


SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఈ మేరకు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 27 అక్టోబర్ 2022, ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 30, నవంబర్ 2022 ఆన్‌లైన్ ఫీజు డిపాజిట్ కోసం చివరి తేదీ - 01 డిసెంబర్ 2022 , కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ - జనవరి 2023న జరగనుంది. 


ఖాళీలు 


నార్కోటిక్స్‌లో 164 ఖాళీలు ఉండగా, ఇతర పోస్టుల్లో 24,205 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, SSC మొత్తం 24,369 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను రిక్రూట్ చేయనుంది. అయితే విడుదల చేసిన ఖాళీల సంఖ్య తాత్కాలికమేనని, అవి మారవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.  


వయో పరిమితి


అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థి వయస్సు 01-01-2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా 02-01-2000 కంటే తరువాత 01-01-2005 కంటే ముందు జన్మించి ఉండాలి. SC / ST వర్గాలకు 5 సంవత్సరాలు మరియు OBC వర్గాలకు 3 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంది.


ఆన్లైన్ అప్లికేషన్


దరఖాస్తులు ఆన్‌లైన్లో మాత్రమే ఆమోదించబడతాయి. ఈ పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో నిర్వహించబడుతుంది. చివరిగా ఎంపికైన అభ్యర్థులు పే లెవల్ 1 కింద రూ. 18,000 నుండి 56,900 వరకు మరియు లెవల్ 3 కింద రూ. 21,700 నుండి 69,100 వరకు జీతం అందుకునే అవకాశం ఉంది. ఎన్సీసీ సర్టిఫికెట్ హోల్డర్ అభ్యర్థులు ఈ పరీక్షలో బోనస్ మార్కులు పొందుతారు. 


Also Read: Andaru Bagundali Andulo Nenundali: ఆహా'లో నరేష్ - పవిత్ర భార్యాభర్తలుగా నటించిన మూవీ రిలీజ్.. ఎలా ఉందంటే?


Also Read: Kantara Domination: దీపావళి నాలుగు సినిమాలను లేపి అవతలేసిన కాంతార.. ఇదెక్కడి మాస్ ర్యాంపేజ్ మావా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook