Corona vaccine: ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ ఏ దశలో
కరోనా వైరస్ ( Corona virus ) కు ఇదిగో వ్యాక్సిన్..అదిగో వ్యాక్సిన్. చిన్నపిల్లల్ని బుజ్జగించడానికి చెప్పే మాటల్లా మారిపోయాయి. ఈ క్రమంలో రష్యా అయితే వ్యాక్సిన్ రెడీ అనడమే కాకుండా...ఉత్పత్తి కూడా ప్రారంభించింది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ పరిస్థితి ఏ దశలో ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు..
కరోనా వైరస్ ( Corona virus ) కు ఇదిగో వ్యాక్సిన్..అదిగో వ్యాక్సిన్. చిన్నపిల్లల్ని బుజ్జగించడానికి చెప్పే మాటల్లా మారిపోయాయి. ఈ క్రమంలో రష్యా అయితే వ్యాక్సిన్ రెడీ అనడమే కాకుండా...ఉత్పత్తి కూడా ప్రారంభించింది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ పరిస్థితి ఏ దశలో ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు..
కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కనుగొనేందుకు వివిధ దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఏ దేశపు ప్రయత్నం ఏ దశలో ఉంది..ఏ వ్యాక్సిన్ ఏ ఫేజ్ ( phases and status of vaccines ) లో ఉందనేది తెలుసుకుందామిప్పుడు. అన్నింటికంటే ముందు వ్యాక్సిన్ కనుగొన్నామని ప్రకటించిన రష్యాకు చెందిన స్పుత్నిక్ వి గురించి తెలుసుకుందాం. Also read: Blood Circulation: రక్త శుభ్రత, రక్త ప్రసరణ మెరుగుదల ఎలా ?
స్పుత్నిక్ వి ( Sputnik v ) వ్యాక్సిన్
స్పుత్నిక్ వి గా పేరు పెట్టిన రష్యా వ్యాక్సిన్ ( Russia vaccine ) వాస్తవానికి ఆగస్టు నెలలో మూడోదశ ప్రయోగాలు జరగాల్సి ఉన్నాయి. అయితే హఠాత్తుగా ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఫస్ట్ ఫేజ్ ఉత్పత్తి ( First phase production )పూర్తయిందని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్నిదేశాలు స్వాగతిస్తుంటే మరి కొన్నిదేశాలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇండియాకు చెందిన ఐసీఎంఆర్ ( ICMR ) కూడా ఆ వ్యాక్సిన్ పనితీరును సమీక్షించిన తరువాతే వాడకం గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
చైనా కాన్ సైనో ( Cansino ) వ్యాక్సిన్
చైనా దేశానికి చెందిన కాన్ సైనో వ్యాక్సిన్ కూడా పూర్తయింది. ఈ వ్యాక్సిన్ వాడకానికి చైనా జూన్ లోనే అనుమతిచ్చింది. అయితే కేవలం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ( peoples liberation army ) సైనికులకు మాత్రమే వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటన వచ్చింది. ఎంతమందికి ఇచ్చారనేది ఇంకా తెలియలేదు. మరోవైపు ఈ వ్యాక్సిన్ మూడోదశ ( Vaccine 3rd phase ) ప్రయోగాల్నిసౌదీ అరేబియాలో జరుపుతామని చైనా ప్రకటించినా..ప్రయోగాలు చేసినట్టు దాఖలాలు లేవు. Also read: Corona virus: కరోనా మళ్లీ వస్తుందా ? ఆందోళన కల్గిస్తున్నకొత్త లక్షణం
మోడెర్నా, ఫైజర్ ల ( Moderna and pfizer vaccines ) వ్యాక్సిన్ లు
ఇవి కాకుండా అమెరికాలోని మోడెర్నా ( Moderna ) సంస్థ, ఎన్ఐఏఐడీ ( NIAID ) వ్యాక్సిన్, బయో ఎన్టెక్, పోసున్ ఫార్మా, ఫైజర్ ( Pfizer ) కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ లు తొలి రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. మూడోదశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.
భారత్ బయోటెక్ ( Bharat biotech ) సంస్థ, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( National institute of india ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కో వ్యాగ్జిన్ ( Covaxin ) తొలిదశ ప్రయోగాల్ని పూర్తి చేసుకుని..రెండోదశ మానవ ప్రయోగాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.
ఆశలు ఆక్స్ ఫర్డ్ ( Oxford vaccine ) పైనేనా
ఇక కీలకమైంది ముఖ్యమైంది ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆస్ట్రాజెనెకా ( Astrazeneca ) కలిసి అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ ( Covishield ). ప్రపంచమంతా ఇప్పుడు ఈ వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకుంది. దీనికి సంబంధించిన మూడోదశ ప్రయోగాలు నిర్వహించుకునేందుకు ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum institute of india ) కు ఐసీఎంఆర్ ( ICMR ) అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఆస్ట్రాజెనెకా సంస్థ చేస్తున్న ప్రయోగాలు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. రోగ నిరోధక వ్యవస్థలోని అత్యంత శక్తివంతమైన టీ కణాల ( T Cells ) ఉత్పత్తిని ఈ వ్యాక్సిన్ పెంచుతున్నట్టు నిపుణులు ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసి సరఫరా చేసేంది ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ కావడం దేశానికి గర్వ కారణమే. Also read: Corona vaccine: ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తిని పూర్తి చేసిన రష్యా