Woman raped by SI in Kanyakumari: న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఆమెకు మరింత అన్యాయమే జరిగింది. సమస్యను తీర్చాల్సిన ఇన్‌స్పెక్టర్ ఆమెపై కన్నేసి అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. ఆపై బలవంతంగా అబార్షన్ చేయించాడు. అతనిపై కేసు నమోదు చేయాల్సిందిగా బాధిత మహిళ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టు తిరిగినా లాభం లేకపోయింది. చివరకు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్సై సహా మరో 8 మందిపై కేసు నమోదైంది. తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళకు (Kerala) చెందిన ఓ మహిళ (31) కొన్నేళ్లుగా కన్యాకుమారి జిల్లా కుజితురై పట్టణంలోని ఎంసీ కోడు ప్రాంతంలో నివసిస్తోంది. గతంలో కేరళలోని త్రివేండంలో ఆమె నర్సుగా పనిచేసేది. కొన్నేళ్ల క్రితం ఆమెకు వివాహమవగా భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమె 9 ఏళ్ల కుమార్తె హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది.


ఇదే క్రమంలో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. అయితే ఆ చనువును అడ్డుపెట్టుకుని అతను ఆ మహిళను మోసం చేశాడు. ఆమె నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదే విషయంపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో (Tamilnadu Police) ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది.


ఆ సమయంలో సబ్ ఇన్‌స్పెక్టర్ సుందరలింగం ఆ మహిళను పలు వివరాలు అడిగి తెలుసుకున్నాడు. మాటల క్రమంలో ఆమె ఒంటరిగా ఉంటుందని గ్రహించాడు. అప్పటినుంచి కేసు పేరు చెప్పి తరచూ ఆమె ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఓరోజు ఆమెపై అత్యాచారానికి (Woman raped by SI) పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని సుందరలింగంతో చెప్పగా ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు.


సుందరలింగంపై బాధితురాలు (Rape Victim) ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అతను ఎస్సై కావడంతో ఎక్కడా కేసు నమోదవకుండా చేయగలిగాడు. ఈ క్రమంలో ఆమె మహిళా సంఘాలతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు కూడా దిగింది. చివరకు కోర్టును ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకోవడంతో న్యాయస్థానం ఎస్సైపై చర్యలకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మార్తండం వుమెన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సుందరలిగం సహా 8 మందిపై కేసు నమోదైంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.


Also Read: Kamal Haasan Health: కమల్ హాసన్ పై తమిళనాడు ఆరోగ్య శాఖ సీరియస్.. త్వరలోనే నోటీసులు జారీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook