Supreme court: చిత్ర విచిత్ర కేసులు, విభిన్నమైన తీర్పులు. లేదా కోర్టుల అక్షింతలు. సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న మరో ఘటన ఆసక్తి రేపుతోంది. ఏం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఓ కేసుకు సంబంధించిన బోంబే హైకోర్టు ( Bombay high court )జడ్జి జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఛాతీపై చేతితో తాకినంత మాత్రాన లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తీర్పు ఇవ్వడం సంచలనమై..వివాదానికి దారి తీసింది. అటు కేసులు కూడా ధర్మాసనాలు ముందు విచిత్రమైనవే వస్తుంటాయి. అందుకే విభిన్నమైన తీర్పులు, అక్షింతలు వింటూ ఉంటాం.


ఉత్తరప్రదేశ్‌ ( Uttar pradesh )లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టు ( Supreme court )లో ఓ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతే కాదు పిటీషనర్ వాదన కొనసాగిస్తే భారీ జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. యూపీలో శాంతిభద్రతలు లోపించాయని..ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ( President  rule ) విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సీఆర్ జయ సుకిన్ అనే న్యాయవాది పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 


యూపీలో అనేక హత్యలు జరుగుతున్నా..కేంద్ర ప్రభుత్వం ( Central government ) రాష్ట్రానికి ఎలాంటి సూచనలు చేయలేదని న్యాయవాది తెలిపారు.ఇతర రాష్ట్రాల క్రిమినల్ రికార్డులు పరిశీలించారా అని  జస్టిస్ బోబ్డే ప్రశ్నించగా..దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో 30 శాతం యూపీలోనే జరుగుతున్నాయన్నారు. వెంటనే...ఇంతకు మించి ఎక్కువ వాదన విన్పిస్తే భారీ జరిమానా విధిస్తాం..అంటూ హెచ్చరించారు.


Also read: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తెను రెండు సార్లు మోసం చేశారు, అసలేం జరిగిందంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook