Supreme Court: ఢిల్లీ గవర్నమెంట్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారం వివిధ అంశాలపై వివాదాలకు దారితీస్తోంది. ఎవరి అధికారాలేంటనే విషయంపై స్పష్టత కొరవడటంతో  ఒకరి జోక్యాన్ని మరొకరు సహించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి పెరిగి పెద్దదై వివాదాలకు దారి తీస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల పరిధి విషయంలో చెలరేగిన వివాదం కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. ఇరువురి మధ్య అధికారాల విషయంలో చాలాకాలంగా వివాదం రేగుతూనే ఉంది. గతంలో కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసి ఇవాళ తీర్పు వెల్లడైంది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాల్లేవనే 2019 నాటి సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును తోసిపుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలుండాలని కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రం ఆధీనంలోని లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలుంటాయని తెలిపింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేంద్రానికి అధికారాలున్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని దాటి ఉండవంది. ఢిల్లీ పాలనా వ్యవహారాలు ఎవరు చూడాలనే విషయంపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఢిల్లీ పాలన వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అనవసరంగా జోక్యం చేసుకోవద్దని సూచించింది. 


దేశ రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. వైద్య అధికారులు, ఇతర అధికారులపై నియంత్రణ ఢిల్లీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. 2019లో జస్టిస్ అశోక్ భూషణ్ సింగిల్ బెంచ్ జడ్జిగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. 


ఢిల్లీ శాసనసభ్యులు, ఇతర శాసనసభ్యుల మాదిరిగానే ప్రజలతో ఎన్నుకోబడతారని సుప్రీంకోర్టు వివరించింది. ఆర్టికల్ 239 ఏఏ ఢిల్లీ అసెంబ్లీకు చాలా అదికారాలను కల్పిస్తుందని స్పష్టం చేసింది. 


Also read: Maharashtra vs Supreme Court: సుప్రీంకోర్టులో ఇవాళే కీలక తీర్పు, షిండే ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook