Maharashtra vs Supreme Court: సుప్రీంకోర్టులో ఇవాళ అత్యంత కీలక తీర్ప వెలువడనుంది. ధర్మాసనం ఇవాళ ఇచ్చే తీర్పు భవిష్యత్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటు-అనర్హత వేటు అంశాలపై కచ్చితంగా ప్రభావం చూపించనుంది. మహారాష్ట్ర అంశంలో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ కీలకమైన తీర్పు వెల్లడించనుంది.
మహారాష్ట్రలో 2022లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వం పడిపోయింది. ఆ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో కొంతమంది తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం పతనమైంది. ఆ తరువాత బీజేపీ మద్దతుతో కలిపి శివసేన తిరుగుబాటు వర్గం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో పార్టీ విప్ ధిక్కరించి ఓటేసిన ఏక్‌నాథ్ షిండే సహా ఇతర ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్ థాకరే పిటీషన్ దాఖలు చేశారు. ఇదే తిరుగుబాటు అంశంపై మొత్తం 8 పిటీషన్లు దాఖలయ్యాయి.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. ఇవాళ ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు రాజ్యాంగబద్ధతపై తీర్పు వెలువరించనుంది. ఒకవేళ ఈ తిరుగుబాటు అక్రమమని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చితే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సహా 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుంది. ఫలితంగా ఏక్‌నాథ్ షిండే పదవి కోల్పోవడమే కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం పతనమౌతుంది. అందుకే ఇవాళ్టి ఈ తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.
సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే తరపు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఇక ఏక్‌నాథ్ షిండే తరపున హరీష్ సాల్వే, నీరజ్ కౌల్, మహేశ్ జెఠ్మలానీ వాదించారు. 288 సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో 184 మంది సభ్యుల బలం ఉందని ఏక్‌నాథ్ షిండే వర్గం చెబుతోంది. మరోవైపు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందని ఆశిస్తున్నట్టు ఉద్ధవ్ థాక్రే తెలిపారు.
Also read: Karnataka Politics: 30 ఏళ్లుగా ఒకే కులంతో రాజకీయాలు, ఆ పార్టీ ఆయువు పట్టు అదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook