Babri Masjid demolition case: బాబ్రీ కేసులో తీర్పునకు ‘సుప్రీం’ కొత్త డెడ్లైన్
అయోధ్య ( Ayodhya ) లో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబ్రీ కూల్చివేత కేసు కూడా చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి బాబ్రీ విధ్వంసం కేసులో ఆగస్టు 31 నాటికీ తీర్పును వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court of India ) అంతకుముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ( cbi special court ) ఆదేశించిన విషయం తెలిసిందే.
Babri case new deadline: న్యూఢిల్లీ: యూపీలో అయోధ్య ( Ayodhya ) లో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబ్రీ కూల్చివేత కేసు ( Babri Masjid demolition case ) కూడా చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి బాబ్రీ విధ్వంసం కేసులో ఆగస్టు 31 నాటికీ తీర్పును వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court of India ) అంతకుముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ( cbi special court ) ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు మరింత సమయం కావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుప్రీంను అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణను సెప్టెంబరు 30 నాటికి పూర్తిచేసి తీర్పు వెలువరించాలని ఆదేశాలుయ జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ రొహింటన్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. Also read: Bombay High court: తబ్లీగ్ కేసులో విదేశీయుల్ని బలి పశువుల్ని చేశారు
1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani), మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్, ఉమాభారతి, కల్యాణ్ సింగ్ తదితరులు నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసులో రెండేండ్లలో విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2019 జులైలో ఆ గడువు ముగియడంతో మరో 9 నెలలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ గడువును 2020 మేలో మరోసారి ఆగస్టు 31వరకు పొడిగించింది. ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు గడువును పొడిగిస్తూ తాజా ఆదేశాలు జారీచేసింది. ఇదిలాఉంటే.. ఈ కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి తదితరులు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. Also read: Dawood Ibrahim: సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో దావూద్ పాస్ పోర్ట్ వివరాలు