Bombay High court: తబ్లీగ్ కేసులో విదేశీయుల్ని బలి పశువుల్ని చేశారు

దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన తబ్లీగ్ జమాత్ ( Tablighi jamaat ) కేసులో బోంబే హైకోర్టు ( Bombay high court ) కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీయుల్ని బలిపశువుల్ని చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వారిపై నమోదైన కేసుల్ని కొట్టివేసింది. 

Last Updated : Aug 22, 2020, 11:50 PM IST
Bombay High court: తబ్లీగ్ కేసులో విదేశీయుల్ని బలి పశువుల్ని చేశారు

దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన తబ్లీగ్ జమాత్ ( Tablighi jamaat ) కేసులో బోంబే హైకోర్టు ( Bombay high court ) కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీయుల్ని బలిపశువుల్ని చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వారిపై నమోదైన కేసుల్ని కొట్టివేసింది. 

ఢిల్లీ ( Delhi ) లోని నిజాముద్దీన్ మర్కజ్ ( nizamuddin markaz ) లో జరిగిన ధార్మిక సమావేశానికి ( Religious congregation ) హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసుల్ని బోంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది. ఈ సందర్భంగా  జస్టిస్ టీవీ నాలావాడే, జస్టిస్  ఎంజీ సెవ్లికల్ లు కీలకమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా..పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్చ్ నెలలో జరిగిన తబ్లీగ్ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల్ని బలి పశువుల్ని ( Scapegoat the Foreigners ) చేశారని..కరోనా సంక్రమణకు కారణమయ్యారంటూ అనవసర ప్రచారం జరిగిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు పర్యాటక వీసా షరతుల్ని ఉల్లంఘించారన్న ఆరోపణల్ని కోర్టు కొట్టివేసింది. నచ్చిన ధార్మిక ప్రాంతాల్ని పర్యటించడం గానీ..మత పద్ధతుల్ని అవలంభించడం నుంచి గానీ విదేశీయుల్ని నిరోధించలేమని కోర్టు అభిప్రాయపడింది. సవరించిన అప్ డేట్ చేసిన టూరిస్ట్  వీసా మాన్యువల్ లో( Toursit visa manual ) కూడా ధార్మిక ప్రాంతాల సందర్శనపై ఎలాంటి ఆంక్షలు లేవని కోర్టు తెలిపింది.

అతిధుల్ని స్వాగతించే గొప్ప సంప్రదాయం, సంస్కృతిని భారతీయులు పాటిస్తున్నారా అని కోర్టు ప్రశ్నించింది. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపం పడాలని..మరోసారి పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించింది కోర్టు. Also read: Dawood Ibrahim: సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో దావూద్ పాస్ పోర్ట్ వివరాలు

Trending News