Dawood Ibrahim: సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో దావూద్ పాస్ పోర్ట్ వివరాలు

ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీలు ( Indian Securiry Agency ) అండర్ వరల్డ్  డాన్ ( Underworld Don ) పాస్ పోర్టుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కనుగొన్నారు. 

Last Updated : Aug 23, 2020, 12:02 AM IST
    • ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీలు అండర్ వరల్డ్ డాన్ పాస్ పోర్టుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కనుగొన్నారు. 26/11 ముంబై సీరియల్ ( బ్లాస్ట్ తో పాటు అనేక నేరాల్లో మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రాహింకు సంబంధంచిన పాస్ పోర్టు వివరాలు తెలుకున్నారు.
    • సెక్యూరిటీ ఏజెన్సీల ప్రకారం... దావూడ్ ఇబ్రాహిం కాస్కర్ఎన్నో పాస్ పోర్టులు మెయింటేన్ చేస్తున్నాడు. భారత్ తో పాటు పాకిస్తాన్, దుబాయ్, కామన్వెల్త్ ఆఫ్ డోమినికా దేశాల నుంచి వాటిని పొందాడు.
    • డి-కంపెనీని స్థాపించి నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో దావూద్ కూడా ఉన్నాడు.
Dawood Ibrahim: సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో దావూద్ పాస్ పోర్ట్ వివరాలు

ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీలు ( Indian Securiry Agency ) అండర్ వరల్డ్  డాన్ ( Underworld Don ) పాస్ పోర్టుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కనుగొన్నారు. 26/11 ముంబై సీరియల్ ( 26/11 Seriel Blast Master Mind ) బ్లాస్ట్ తో పాటు అనేక నేరాల్లో మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రాహింకు సంబంధంచిన పాస్ పోర్టు వివరాలు తెలుకున్నారు.సెక్యూరిటీ ఏజెన్సీల ప్రకారం... దావూడ్ ఇబ్రాహిం కాస్కర్ ( Dawood Ibrahim Kaskar ) ఎన్నో పాస్ పోర్టులు మెయింటేన్ చేస్తున్నాడు. భారత్ తో పాటు పాకిస్తాన్, దుబాయ్, కామన్వెల్త్ ఆఫ్ డోమినికా దేశాల నుంచి వాటిని పొందాడు.

దావూ ఇబ్రాహిం పేరుపై ఉన్నాపాస్ పోర్టులు ( PassPorts in Dawood Ibrahim Name )

  • K-560098 తేదీ 30-09-1975  ముంబై
  • M-110522 తేదీ 13-11-1978  ముంబై
  • P-537849  తేదీ30-11-1979   ముంబై
  • R-841697 తేదీ 26-11-1981   ముంబై
  • V-57865 తేదీ  03-01-1983     ముంబై
  • A-333602 తేదీ 04-06-1985   ముంబై
  • A-501801 26-07 -1985  ముంబై 
  • A-717288 తేదీ 18.8.85    దుబాయ్ (  మొహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ రహ్మాన్ షేక్ పేరుతో )
  • F-823692 తేదీ.02.09.89   దుబాయ్,  ( షేక్ దావూద్ హసన్ పేరుతో)
  • G-866537 తేదీ 12.08.91,  రావల్పిండి- పాకిస్తాన్ ( షేక్ హసన్ పేరుతో )
  • C-267185 తేదీ July 1996  కరాచీ - పాకిస్తాన్ ( షేక్ దావూద్ హసన్ పేరుతో  బాంబే , ఇండియా )  అతని ప్రస్తుత నివాస చిరునామా 17 సిపి, బెరార్ సొసైటీ, 7-8 బ్లాక్, అమీర్ ఖాన్ రోడ్, కరారీ పాకిస్తాన్
  • WHO: రెండు సంవత్సరాల్లో కరోనా అంతం

సెక్యూరిటీ ఏజెన్సీల ప్రకారం దావూద్ ఇబ్రాహిం కు మొహమ్మద్ హనీప్ మేనన్ లేదా మొహమ్మద్ హనీఫ్ మెర్చంట్ పేరుతో 23 మార్చి 2000 లేదా 23 మార్చి 2003లో పాస్ పోర్టు జారీ చేశారు.

దాంతో పాటు దావూ ఇబ్రాహిం కామన్వెల్త్ ఆఫ్ డోమినికా ( Commonwealth Of Dominica ) దేశం నుంచి కూడా పాస్ పోర్టు సంపాదించాడు. ఎకనామిక్ సిటిజెన్ షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా అతనికి నాగరికత అందించారు. దీని కోసం అతను భారీ మొత్తంలో విదేశీ నగదును అందించాడట. డబ్బుతో ఈ దేశంలో నాగరికత సొంతం చేసుకోవచ్చట.

దావూద్ పేరుపై ఉన్న మరో పాస్ పోర్టు F-823692 దీన్ని 02.09.1989న జారీ చేశారు. దీన్ని దుబాయ్ ( Dubai )  ప్రభుత్వం షేక్ దావూద్ హసన్ పేరుమీద జారీ చేసింది.

దావూద్ తమ దేశంలో ఉన్నట్టు ఎప్పడూ అంగీకించని పాకిస్తాన్ ( Pakistan )  ఐక్యరాజ్య సమితి ( UN ) ఒత్తిడి వల్ల ఇటీవలే 88 మందిని టెర్రరిస్టుగా గుర్తించి వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించింది. ఇందులో దావూద్ పేరు కూడా ఉంది. ఐక్యరాజ్య సమితి పేర్కొన్న రిజల్యూషన్ లో పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నభారత దేశ  మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రాహిం పేరు కూడా ఉంది.

1993లో ముంబైలో మారణం హోం జరిపిన దావూద్ తరువాత భారత నుంచి తప్పించుకున్నాడు. డి-కంపెనీని స్థాపించి నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో దావూద్ కూడా ఉన్నాడు. 

   ఇవి కూడా చదవండి

Trending News