Sushant death case: కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే.
Supreme Court Orders: న్యూఢిల్లీ: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. తనపై పాట్నా పోలీసులు నమోదు చేసిన కేసును ముంబైకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పిటిషన్‌ను దాఖలు చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును ప్రకటించింది. అంతేకాకుండా సుశాంత్ మృతి కేసులో (Sushant death case) దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అవసరమనుకుంటే కొత్తగా కేసు ఫైల్ చేయడానికి కూడా సుప్రీం సీబీఐకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Also read: Rhea Chakraborty: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ కాల్ డేటాలో రానా, రకుల్, అమీర్ ఖాన్ పేర్లు
ముంబైలో జూన్ 14న బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సుశాంత్ మృతి కేసులో ఎన్నో పరిణామాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు చాలామందిని, మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు విచారించారు. దీంతోపాటు ఈ వ్యవహారంలో మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాల మధ్య వైరం సైతం రాజుకుంది. విచారణకు పాట్నా నుంచి ముంబై వెళ్లిన పోలీసు అధికారిని ముంబై అధికారులు అడ్డుకోని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య మరింత పెరిగింది. Also read: Adipurush: ప్రభాస్ పాత్రపై రాధే శ్యామ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్
ఇదిలాఉంటే.. సుప్రీం ఇచ్చిన తీర్పును సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ స్వాగతించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సుశాంత్ మాజీ స్నేహితురాలు అంకిత లొఖాండే, పలువురు నటులు ఈ తీర్పును స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. Also read: Healh Tips: పరిగడుపున వెల్లుల్లి తినడం వల్ల లాభాలు తెలుసా..?