Orphan children: కరోనా మహమ్మారి ఎందరో జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. మరెందరినో రోడ్డున పడేసింది. వందలాది చిన్నారుల్ని అనాధల్ని చేసింది. కొందరు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా..మరి కొందరు ఎవరో ఒకరిని పోగొట్టుకున్న పరిస్థితి. ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి..ఎవరిది సంరక్షణ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్(Corona Virus) ప్రపంచాన్ని గజగజలాడించింది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు. దేశవ్యాప్తంగా 75 వేల 320 మంది చిన్నారులు అనాధలుగా మారారు. ఇందులో తల్లిదండ్రులిద్దరికీ కోల్పోయినవారి సంఖ్య 6 వేల 855 కాగా..తల్లి లేదా తండ్రిని కోల్పోయినవారు 68 వేల 218గా ఉంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మరో 247 మంది దిక్కులేని బాలలు మిగిలారని సుప్రీంకోర్టుకు(Supreme Court) సమర్పంచిన 30 పేజీల అఫిడవిట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా అనాధలుగా మారిన చిన్నారుల సంరక్షణ బాధ్యతల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలంటూ ఎన్‌సీపీసీఆర్(NCPCR)అభ్యర్ధించింది. ఎన్‌సీపీసీఆర్ అభ్యర్ధన మేరకు అనాధలుగా మారిన చిన్నారుల సంరక్షణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.


కరోనా కారణంగా అనాథలుగా మిగిలిన చిన్నారులు దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నారు. 13 వేల 589 మంది చిన్నారులు ఈ రాష్ట్రంలో అనాథలయ్యారు. ఇక 6 వేల 562 మంది అనాథ చిన్నారులతో ఒరిస్సా రెండవ స్థానంలో ఉండగా..6 వేల 210 మంది చిన్నారులతో ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) మూడవ స్థానంలో ఉంది. ప్రభుత్వాలు అనాధ చిన్నారుల సంరక్షణకు చేపట్టిన కార్యాచరణ వివరాలతో నివేదికను ఆగస్టు 13 వరకూ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. 


Also read: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమంటూ హెచ్చరికలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook