SC on Manipur Viral Video Case: న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అరాచకం ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. మణిపూర్‌లో జాత్యాహంకారంతో ఇద్దరు మహిళలను వీధుల్లో నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4వ తేదీన జరగ్గా.. మే 18వ తేదీన జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇదే విషయమై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జే బి పరిద్వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు సభ్యులుగా ఉన్న త్రిసభ్య ధర్మాసనం కేంద్రంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు అంత జాప్యం జరిగింది అని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు మణిపూర్ పోలీసులపైనా విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంత నిర్లక్ష్యం ఎందుకంటూ మణిపూర్ పోలీసుల వైఖరిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. 14 రోజులు పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మణిపూర్ పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిలదీసింది. మణిపూర్‌ హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ ప్రశ్నలు సంధించింది. మణిపూర్‌లో ఘటనలో బాధితులైన ఇద్దరు మహిళల తరపున సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.


రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ మాట్లాడిన ఒక న్యాయవాది అభిప్రాయంతో విభేదించిన చీఫ్ జస్టిస్.. దేశంలో అక్కడ, ఇక్కడ అని కొన్ని ప్రాంతాలు కాకుండా ఇప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళలపై అరాచకాలు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా కొన్ని ప్రాంతాల్లోనే ఈ ఘటనలు జరుగుతున్నట్టుగా చెప్పడం ద్వారా మీరు ఏం చెప్పదల్చుకున్నారు అని సదరు న్యాయవాదిని ప్రశ్నించారు.


ఇది కూడా చదవండి : manipur violence: మణిపూర్‌ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు..


మణిపూర్ హింసాకాండపై సుప్రీం కోర్టు కేంద్రంపై మండిపడిన నేపథ్యంలో కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఒకవేళ మణిపూర్ ఘటనపై విచారణను సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించాలనుకుంటే అందులో కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.


ఇది కూడా చదవండి : Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి