Bipin Rawat death news: సర్జికల్ స్ట్రైక్స్ నుంచి మయన్మార్ మిషన్ వరకు.. బిపిన్ రావత్ కెరీర్ హైలైట్స్
Bipin Rawat role in Surgical Strikes: తమిళనాడులో ఇండియన్ ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అమరులైన సంగతి తెలిసిందే. సూలూరు నుంచి నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి (DSSC in Wellington) వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Bipin Rawat role in Surgical Strikes: తమిళనాడులో ఇండియన్ ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అమరులైన సంగతి తెలిసిందే. సూలూరు నుంచి నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి (DSSC in Wellington) వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చాపర్ కూలిన ఘటనలో చాపర్ లో ఉన్న 14 మందిలో 13 మంది దుర్మరణం పాలవగా మరొకరు తీవ్ర గాయాలతో వెల్లింగ్టన్ లోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జనరల్ బిపిన్ రావత్ దేశానికే తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. అన్ని రక్షణ బలగాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి దేశ రక్షణను మరింత పఠిష్టపర్చడంలో బిపిన్ రావత్ చేసిన సేవలు ఎనలేనివి. బిపిన్ రావత్ దేశ రక్షణలోనే ప్రాణాలు విడిచిన ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన కెరీర్ లో సాధించిన రికార్డులు, అధిగమించిన అరుదైన మైలురాళ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
India’s First CDS - దేశానికి తొలి సీడీఎస్‌గా రావత్ నియామకం :
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన రక్షణ బలగాలను సమన్వయపరుస్తూ ఒక అధిపతిని నియమించాలని కేంద్రం 2019 డిసెంబర్ 30న నిర్ణయం తీసుకుంది. అలా భారత ప్రభుత్వం నియమించిన మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కావడం విశేషం.
Also read : CDS Bipin Rawat Helicopter Crash, Bipin Rawat death news: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్ మృతి
27th Chief of Army Staff - 27వ ఆర్మీ చీఫ్‌గా బిపిన్ రావత్ నియామకం:
జనరల్ బిపిన్ రావత్ 2016, డిసెంబర్ 17న దేశానికి 27వ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 1978 డిసెంబర్ లో బిపిన్ రావత్ తొలిసారిగా ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశించారు. 11 గోర్కా రైఫిల్స్‌కి చెందిన 5వ బెటాలియన్ ద్వారా బిపిన్ రావత్ ఇండియన్ ఆర్మీలోకి వచ్చారు. బిపిన్ రావత్ తండ్రి కూడా ఇదే బెటాలియన్ ద్వారా ఇండియన్ ఆర్మీకి సేవలు అందించడం విశేషం. ఇండియన్ ఆర్మీకి సేవలు అందిస్తూనే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ విభాగంలోనూ బిపిన్ రావత్ పనిచేశారు.
Militancy in Northeast - ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపనకు కృషి :
ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటన్సీ కార్యకలాపాలు తగ్గించి శాంతిని స్థాపించడంలో బిపిన్ రావత్ చేసిన కృషి, చూపిన చొరవ అమోఘం. దిమాపూర్‌లోని III Corps విభాగానికి నేతృత్వం వహిస్తూ చేపట్టిన మిషన్ సక్సెస్ అవడంతో ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెన్సీ తగ్గుముఖం పట్టింది.
Surgical Strike - సర్జికల్ స్ట్రైక్స్ :
ఇండియన్ ఆర్మీ బలగాలు భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచంలోనే పతాక శీర్షికలకెక్కాయి. పాకిస్థాన్ భూభాగంపై నుంచి భారత్‌లోకి చొరబాట్లు సహకరిస్తున్న ఐఎస్ఐని, వారి బంకర్లను ధ్వంసం చేసి పాకిస్థాన్‌ని గట్టి దెబ్బ కొట్టడంలో భారత్ ఘన విజయం సాధించిన క్షణాలు అవి.
Also read : Bipin Rawat killed Timeline: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం.. విషాద ప్రయాణం సాగిందిలా
ఈ విజయవంతమైన ఆపరేషన్ బిపిన్ రావత్ నేతృత్వంలో జరిగిందే. న్యూ ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచే బిపిన్ రావత్ సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్‌ని (Surgical Strike) పర్యవేక్షించారు.
Myanmar Mission - మయన్మార్ మిషన్ :
బిపిన్ రావత్ (General Bipin Rawat career highlights) 40 ఏళ్ల ఇండియన్ ఆర్మీ కెరీర్లో చొరబాట్లను అడ్డుకోవడంలో, దాడులను తిప్పికొట్టడంలో, మయన్మార్ క్రాస్ బార్డర్ ఆపరేషన్ పర్యవేక్షణలో విజయం సాధించారు.
Also read : Omicron third wave latest updates : జనవరిలోనే కరోనా థర్డ్ వేవ్.. ఫిబ్రవరిలో పీక్ స్టేజ్! రోజుకు లక్షకు పైగా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook