Tamilnadu Assembly Elections 2021: ఆల్ ఫ్రీ బాబు గతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న జోక్. ఇప్పుడు అన్నాడీఎంకేను అనాల్సివస్తుందేమో. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీ వరాల జల్లు కురిపిస్తోంది. ఆల్ ఫ్రీ అంటోంది. ప్రతిపక్షానికి పోటీగా అన్నీ ఉచితం అంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల(Tamilnadu Assembly Elections) ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. మొన్న ప్రతిపక్షం డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో(DMK Manifesto) విడుదల చేసింది. 5 వందల అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉచితాలకు అలవాటైన తమిళనాడుకు భిన్నంగా ఈ మేనిఫెస్టో ఉంది. ఈలం తమిళులకు పౌరసత్వం, సేలం గ్రీన్ వే పనుల నిలుపుదల, అదాని హార్బన్ నిర్మాణం నిలుపుదల, సీఏఏకు వ్యతిరేకత వంటి వివిధ అంశాలున్నాయి. దీనికి పోటీగా అధికార ఏఐఏడీఎంకే మేనిఫెస్టో(AIADMK Manifesto) విడుదల చేసింది.


163 హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి పళనిస్వామి ( Palaniswamy) విడుదల చేసింది. రేషన్ కార్డుదారులకు అమ్మ వాషింగ్ మెషీన్లు, ఇళ్లు లేనివారికి పక్కా గృహాలు, ఇంటి వద్దకే రేషన్, మహిళల కోసం ఇంటి దీపం పథకం, ఇంటింటా సౌరశక్తి గ్యాస్ స్టౌవ్‌లు , ఏడాదికి ఆరు సిలెండర్లు వంటి వాగ్దానాలు ప్రముఖంగా ఉన్నాయి. మహిళలకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ, సౌరశక్తి స్టౌవ్‌లు, ఇంటి వద్దకే రేషన్, కేబుల్ ప్రసారాలు, అమ్మ వివార కానుక పెంపు, వవ దంపతులకు  సారె పథకాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ సేవలతో అమ్మ క్లినిక్‌లు, ప్రసూతి సెలవులు 12 నెలలకు పొడిగింపు, 2 జీబీ ఉచిత డేటా, ఇంటికో ఉద్యోగం వంటివి ఉన్నాయి. వృద్ధ్యాప్య పెన్షన్ 2 వేలకు పెంపు,  మద్రాస్ హైకోర్టును తమిళనాడు హైకోర్టు ( Tamilnadu High court )గా మార్చడం, వ్యవసాయ కమీషన్ ఏర్పాటు, రాజీవ్ హంతకుల విడుదల, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వంటివి ఉన్నాయి. మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఈసారి ఉచితాలకు వెళ్లకపోయినా..అధికార పార్టీ మాత్రం ఆల్ ఫ్రీ అంటూ ప్రచారం చేస్తోంది. 


Also read: JEE Mains Examinations 2021: జేఈఈ మెయిన్స్ పరీక్షలు రేపటి నుంటి ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook