Tamilnadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా చిన్నమ్మగా సుపరిచితమైన శశికళ మళ్లీ రంగప్రవేశం చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో(Tamilnadu)ప్రతిపక్షం అన్నాడీఎంకే(AIADMK)పెద్దల్లో కలవరం రేగుతోంది. తమిళ చిన్నమ్మ, జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ రాజకీయ ప్రవేశం చేస్తుండటమే దీనికి కారణం. తమిళనాడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు చిన్నమ్మ సిద్ధమవుతున్నారు. నేనొస్తున్నా అంటూ కేడర్‌ను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. అక్రమార్జన, అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనంతం బెంగళూరు జైలు నుంచి విడుదలవుతూనే అన్నాడీఎంకే పార్టీలో కలవరం రేగించారు. పార్టీ పగ్గాలు చేపడతానంటూ ప్రకటించి ఆమె మద్దతుదారుల్లో ఉత్సాహం రేకెత్తించారు. అటు బెంగళూరు జైలు నుంచి చెన్నైకు భారీ ఊరేగింపుతో వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం రేపారు. 


ఇప్పుడు మళ్లీ చిన్నమ్మే(Chinnamma)స్వయంగా నేనొస్తున్నా అంటూ ప్రకటన విడుదల చేయడం తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పార్టీ కేడర్‌లో చొచ్చుకెళ్లేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ ఆందరిదని..అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించేవారు తల్లితో సమానమని..కేడర్‌ను బిడ్డలుగా చూసుకోవల్సిన అవసరముందని శశికళ(Sasikala) తెలిపారు. మొత్తానికి నేనొస్తున్నా అంటూ పార్టీ పెద్దల గుండెల్లో చిన్నమ్మ కలకలం రేపారు. 


Also read: Delhi Under Terror Attack: ఢిల్లీలో ఉగ్రదాడుల హెచ్చరిక, అప్రమత్తమైన పోలీసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook