Delhi Under Terror Attack: ఢిల్లీలో ఉగ్రదాడుల హెచ్చరిక, అప్రమత్తమైన పోలీసులు

Delhi Under Terror Attack: దేశ రాజధాని ఢిల్లీకు మరోసారి ఉగ్రముప్పు హెచ్చరిక జారీ అయింది. దసరా, దీపావళి పురస్కరించుని ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2021, 02:29 PM IST
 Delhi Under Terror Attack: ఢిల్లీలో ఉగ్రదాడుల హెచ్చరిక, అప్రమత్తమైన పోలీసులు

Delhi Under Terror Attack: దేశ రాజధాని ఢిల్లీకు మరోసారి ఉగ్రముప్పు హెచ్చరిక జారీ అయింది. దసరా, దీపావళి పురస్కరించుని ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

దేశ రాజధాని నగరంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయా..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అదే చెబుతున్నాయి. దసరా, దీపావళి సందర్భంగా ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు(Terror Attacks)చేసే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేశ్ ఆస్థానా నేతృత్వంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడులకు సంబంధించి ఇంటెలిజెన్స్ హెచ్చరికలపై చర్చించారు. ఉగ్రవాదులు(Terrorists) స్థానికుల సహకారం తీసుకునే అవకాశమున్నందున నగరమంతా పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఢిల్లీలో సైబర్ కేఫ్‌లు, రసాయనాలు అమ్మే దుకాణాలు, పార్కింగ్ స్థలాలు, పాతకార్లు అమ్మే డీలర్లు, చెత్త, తుక్కు సామానులు అమ్మే ప్రాంతాల్లోని వ్యక్తులపై ప్రధానంగా దృష్టి సారించాలని రాకేశ్ ఆస్థానా సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానిక వాచ్ మెన్లు, కాలనీ, అపార్ట్‌మెంట్ కమిటీలతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో అద్దెకు వచ్చివారు, ఇతర ప్రాంతాల్నించి ఉపాధి పేరుతో ఉన్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశాలు జారీ అయ్యయి. 

Also read: RBI New Decision: ఆర్బీఐ గుడ్‌న్యూస్, ఆర్ధిక వెసులుబాటు మరో ఆరు నెలలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News