Tata Memorial Hospital On Cancer: కేన్సర్‌పై ఇటీవలి మాజీ క్రికెకటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధు చేసిన వ్యాఖ్యలను టాటా మెమోరియల్‌ ఆసుపత్రి వైద్య బృందం ఖండించింది. ఆయన భార్య నవ్‌జోత్‌ కౌర్‌ సిద్ధ కేన్సర్‌ నయం అవ్వడానికి తీసుకున్న చికిత్సపై ఓ వీడియో కాన్ఫరెన్స్‌ ఇటీవల ఆయన నిర్వహించారు. దీనిపై టాటా ఆసుపత్రి ఆన్‌కాలజిస్టులు ఓ పత్రికా ప్రకటన చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలోని టాటా మెమోరియల్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ప్రమేష్‌ సీఎస్‌ ఎక్స్‌ వేదికగా మాజీ క్రికెటర్‌ తన భార్యకు కేన్సర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఓ ప్రకటన విడుదల చేశారు.'ముఖ్యంగా ఎవ్వరూ ఫూల్‌ అవ్వకండి, ఏ పుకార్లను నమ్మకండి..ఇవి నిరూపితం కాని, సలహాలు.. ఆమె కేన్సర్‌ నయం అవ్వడానికి సర్జరీ చేయించుకున్నారు, కీమోథెరపీకి వెళ్లారు అదే కేన్సర్‌ నయం అవ్వడానికి సరైన మార్గం.. కానీ, ఏ పసుపు, వేపాకు తీసుకున్నంత మాత్రానా కేన్సర్‌ నయం అవ్వదు' అని నవజోత్‌ సింగ్‌ కేన్సర్‌పై విడుదల చేసిన వీడియోపై ప్రొఫెసర్‌ ప్రమేష్‌ పోస్ట్‌ చేశారు. ఇందులో 262 మంది ఆన్‌కాలజిస్టులు సంతకం చేసి ఉంది. 


ఇక గురువారం మాజీ క్రికెటర్‌ నవజోత్ సింగ్‌ సిద్ధు తన భార్యకు బ్రెస్ట్‌ కేన్సర్‌ నయం అవ్వడానికి కారణాలను ఆయన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇందులో సిద్ధు ' పాల ఉత్పత్తులకు, చక్కెరకు దూరంగా ఉండండి.. కేన్సర్‌ను నామరూపం లేకుండా చేయండి.. పసుపు, వేపాకు తినడం వల్ల నయం కాని కేన్సర్‌ జబ్బు కూడా నా భార్యకు నయమైపోయింది' అని  సిద్ధు అన్నారు. 


 




 


అయితే, టాటా ప్రొఫెసర్‌ల బృందం సిద్ధు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. 'మాజీ క్రికెటర్‌ సిద్ధు చెప్పిన ఉత్పత్తులతో కేన్సర్‌ నయం అయిపోతుందని ఎలాంటి ఆధారాలు లేవు, కానీ, ఈ రెండిటి పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. పసుపు, వేపాకు కేన్సర్‌ యాంటీ ఏజెంట్లు అని ఏ క్లినికల్‌ డేటా లేదు. అందుకే ప్రజలు ఇలాంటి నిరాధార చిట్కాలు పాటించకండి. మీకు ఏవైనా కేన్సర్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే కేవలం కేన్సర్‌ స్పెషలిస్టును మాత్రమే కలవండి. వారి సలహాలు మాత్రమే పాటించండి. ఎందుకంటే కేన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. ముఖ్యంగా ఈ కేన్సర్‌ చికిత్స కేవలం సర్జరీ, రేడియేషన్‌ థెరపీ, కీమోథెరపీ విధానమే నిరూపితమైన చికిత్స అన్నారు.


 



 


ఇదీ చదవండి: ఈ 3 కొవ్వును కట్ చేసే కిచెన్ వస్తువులు.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెడతాయి..


ఇక ఈ వీడియోలో నవజోత్ సింగ్‌ సిద్ధు తన భార్య పసుపు, వేప వంటి మూలికలు తీసుకుంటూ ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేసిందని దీంతో నయం కాని కేన్సర్‌ జబ్బు కూడా నయమైంది. ఆమె ఉదయం 10 గంటలలోపు బ్రేక్‌ఫాస్ట్‌, సాయంత్రం 6:30 లోపు డిన్నర్‌ చేసేదని తన భార్య డైట్‌ ప్లాన్‌ గురించి కూడా చెప్పారు. సిద్ధూ చేసిన ఈ వీడియోపై ఎక్స్‌ వేదికగా కూడా రకరకాలు స్పందించారు. 


ఇదీ చదవండి:   ఉదయం మీకు ఉండే ఈ 5 చెడు అలవాట్లే బరువు పెరగడానికి అసలు కారణం..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook