CM KCR: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టా ( new parliament building ) ప్రాజెక్టుకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) శంకుస్థాపన చేయన్నారు.
CM KCR writes letter to PM Narendra Modi: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టా ( new parliament building ) ప్రాజెక్టుకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) శంకుస్థాపన చేయన్నారు. పార్లమెంట్ నూతన భవనానికి ప్రధాని మోదీ పునాది రాయి వేయనున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( CM KCR ) శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం లేఖ రాశారు. సెంట్రల్ విస్టా (Central Vista) దేశ సర్వభౌమత్వాన్ని ఇనుమడింపజేయడంతోపాటు దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ కొనియాడారు.
దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటినుంచో ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త భవన నిర్మాణం వేగంగా పూర్తి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. Also read: New Parliament Building: కొత్త సౌధానికి 10న పూనాది రాయి
రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే పార్లమెంట్ (parliament building) నూతన సౌధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అన్నీ పార్టీలకు ఆహ్వానాన్ని పంపించారు. Also read: New Parliament Building: ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టు టాటా సంస్థ కైవసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook