New Parliament Building: ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టు టాటా సంస్థ కైవసం

దేశపు చట్టాల్ని నిర్మించే అత్యున్నత వేదిక పార్లమెంట్ కు కొత్త భవనం రానుంది. నూతన భవన నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రముఖ దేశీయ కంపెనీ టాటా సంస్థ దక్కించుకుంది. ఎల్ అండ్ టీతో పోటీ పడి దక్కించుకుంది టాటా సంస్థ.

Last Updated : Sep 16, 2020, 08:41 PM IST
  • కొత్త పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న టాటా సంస్థ
  • ఖరారైన 861.90 కోట్ల టాటా సంస్థ బిడ్
  • 865 కోట్లకు బిడ్ దాఖలు చేసిన ఎల్ అండ్ టీ సంస్థ
New Parliament Building: ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టు టాటా సంస్థ కైవసం

దేశపు చట్టాల్ని నిర్మించే అత్యున్నత వేదిక పార్లమెంట్ ( Parliament ) కు కొత్త భవనం రానుంది. నూతన భవన నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రముఖ దేశీయ కంపెనీ టాటా సంస్థ ( Tata projects ) దక్కించుకుంది. ఎల్ అండ్ టీ తో పోటీ పడి దక్కించుకుంది టాటా సంస్థ.

భారత స్వాతంత్ర్య కాలం నుంచి ఉన్న పార్లమెంట్ భవనం రానున్న కొద్దికాలంలో ఇతర అవసరాలకు వేదికగా మారబోతోంది. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్ లో నూతన భవనం ( new parliament building ) త్వరలో నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన ఆర్దిక బిడ్స్ ఖరారయ్యాయి. ఎల్ ఎండ్ టీ ( L & T ) సంస్థతో పోటీ పడి ప్రముఖ దేశీయ దిగ్గజమైన టాటా సంస్థ ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకుంది. నూతన భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ 940 కోట్లుగా అంచనా వేసి నిర్వహించిన వేలంపాట ( Auction ) లో టాటా సంస్థ..861.90 కోట్లకు బిడ్ ను కైవసం చేసుకుంది. అటు ఎల్ అండ్ టీ ఈ నిర్మాణానికి 865 కోట్లుగా బిడ్ దాఖలు చేసింది. టాటా సంస్థ అంతకంటే తక్కువకు బిడ్ వేయడంతో కాంట్రాక్టు టాటా సంస్థకు దక్కింది. 

పార్లమెంట్‌ హౌస్‌ ఎస్టేట్‌లోని 118వ నెంబర్‌ ప్లాట్‌లో 60 వేల చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నూతన భవనం నిర్మితం కానుంది. సెంట్రల్‌ విస్టా రీ డెవలప్‌మెంట్ ( Central vista redevelopment ) ‌లో భాగంగా తొలి ప్రాజెక్టుగా పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులతో త్రిభుజాకార భవనంగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన డిజైన్ కూడా ఖరారైంది. 

బ్రిటిష్‌ కాలంలో ( British period ) నిర్మించిన ప్రస్తుత భవనానికి మరమ్మత్తులు చేసి..ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ( monsoon sessions ) ముగిసిన తర్వాత నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలంలో భవన నిర్మాణం పూర్తిచేయనున్నారు. నూతన పార్లమెంట్‌ భవనంపై భారత జాతీయ చిహ్నం ముద్రించనున్నారు. Also read: Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు

Trending News