Hero Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Tamil hero vijay) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈమేరకు ఓ ప్రకటన కూడా జారీ చేశారు.. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత.. తమిళనాడు రాష్ట్రాన్ని పాలించారు. అనంతరం విజయ్ కాంత్, కమల్‌హాసన్ వంటి అగ్ర హీరోలు కూడా రాజకీయ పార్టీలను ప్రారంభించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో ఫిబ్రవరి 19న పట్టణ స్థానిక ఎన్నికలు (local body elections in TamilNadu) జరగనున్నాయి. ఫిబ్రవరి 22న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల్లో విజయ్ అభిమానులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే వీళ్లందరూ ‘కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్’ కింద పనిచేస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్‌కు వేరే పార్టీతో ఎలాంటి పొత్తు లేదని.. అలాగే ఏ పార్టీ మద్దతు లేదని విజయ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు.


విజయ్ చాపకింద నీరులా తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో జ‌రిగి లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్‌లో విజ‌య్ అభిమానం సంఘం విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ‌క్కం (vijay makkal iyakkam) నుంచి కొంత మంది స‌భ్యులు పోటీ చేసి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల  పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగ‌స్వామితో ద‌ళ‌ప‌తి విజ‌య్ భేటీ అయ్యారు. పుదుచ్చేరి కార్పొరేట్ ఎన్నిక‌ల్లో విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ‌క్కం నుంచి అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌టం విశేషం.


ప్ర‌స్తుతం బీస్ట్ అనే చిత్రంలో విజ‌య్ న‌టించారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌ంగా ఉంది. మ‌రో వైపు దిల్ రాజు నిర్మాత‌గా, వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాలోనూ విజ‌య్ న‌టించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఆ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది.


Also Read: Punjab Elections: పంజాబ్ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్​ ప్రకటన- మరోసారి చన్నీకే అవకాశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook