ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను కలవరపెడుతోన్న అంశం కరోనా వైరస్. మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ఇంకా రూపొందించని కారణంగా కేవలం లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో మాత్రమే కరోనాతో పారాటం చేస్తున్నాం. అయితే రెక్కాడితే గానీ డొక్కాడని కోట్ల కుటుంబాలు దేశంలో ఉన్నాయి. నేటి నుంచి లాక్‌డౌన్ 5.0 అమలులోకి వస్తున్న నేపథ్యంలో కరోనాపై పోరాటంలో భాగంగా ఓ 12 ఏళ్ల విద్యార్థిని గొప్ప మనసు చాటుకుంది.  జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవైపు లాక్‌డౌన్, మరోవైపు పనిలేదు, స్వరాష్ట్రానికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న ముగ్గురు వలసకార్మికులకు నోయిడాకు చెందిన 12ఏళ్ల బాలిక నిహారిక ద్వివేది తన వంతు సాయం చేసింది. వలస కూలీలను వారి ఇళ్లకు పంపేందుకు ఏకంగా రూ. 48000 విరాళం అందించింది. ముగ్గురు వలసకూలీలను ఇంటికి చేర్చేందుకు విమాన టిక్కెట్లును బుక్ చేయడానికి తన పొదుపు చేసుకున్న నగదును నిహారికి ఇచ్చేసి పెద్ద మనసు ఉందని నిరూపించుకుంది.  LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్


సమాజం మనకు ఎంతో చేసిందని ఇప్పుడు సొసైటీకి మనం ఎంతో కొంత తిరిగిచ్చే సమయం వచ్చిందని విద్యార్ధిని నిహారిక చెప్పడం గమనార్హం. స్కూలు పిల్లలు తాము పొదుపు చేసిన డబ్బును ఎలా ఖర్చే చేయాలి, ఏం కొనుక్కోవాలి ప్లాన్ చేసుకోవడం చూస్తుంటాం కానీ, నిహారిక మాత్రం దేశంలో ప్రస్తుత కరోనా విలయాన్ని అర్థం చేసుకుంది. ముగ్గురు వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించి భేష్ అనిపించుకుంది. సాయం చేయండంలో మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి